కోహ్లీ, సాక్షి పద్మ పురస్కారాలు | Dhoni Kohli and others to receive Padma Shri this year.

Padma awards 2017 announced

Padma Awards 2017, Padma Shri 2017, Padma Bhushan 2017, padma vibhushan 2017, padma Shri Kohli, Telugu Persons Padma Awards 2017

Indian Government announced Padma Awards for the year 2017. PV Sindhu, Sakshi Malik and P Gopichand, Dhoni and Kohli in list. No one has been selected for the India's highest civilian award, 'Bharat Ratna' for 2017. The award felicitation ceremony will be held on 26th Jan 2017, the 68th Republic Day of India.

కోహ్లీ, దీపా, సాక్షి లకు పద్మ పురస్కారాలు

Posted: 01/25/2017 03:45 PM IST
Padma awards 2017 announced

2017 సంవత్సరానికిగాను కేంద్ర ప్రభుత్వం పద్మ అవార్డుల ప్రకటించింది. మొత్తం అవార్డు గ్రహీతల జాబితాలో వివరాలను కేంద్రం విడుదల చేసింది. మొత్తం 5000 ఎంట్రీలు రాగా, అందులోంచి 500 పేర్లను ఎంపిక చేసింది. ఇక అత్యున్న పురస్కారం అయిన భారతరత్న అవార్డును ఈ యేడాదికి ఎవరికీ ప్రకటించలేదు. 

బాలీవుడ్ నుంచి ఆశా పారేఖ్, నేపథ్య గాయకులు కైలాష్ ఖేర్, శంకర్ మహదేవన్, సోనూ నిగమ్, వెటరన్ నటుడు రిషి కపూర్, నటుడు మనోజ్ బాజ్ పేయి, నృత్య కళాకారిణి లక్ష్మీ విశ్వనాథన్, రంగస్థల నటుడు బసంతి బిస్త్, కథకళి నృత్యకారుడు సీకే నాయర్ లకూ పద్మభూషణ్ అవార్డులు లభించాయి.

ఇక రెండవ అత్యున్నత పౌరపురస్కారమైన పద్మ విభూషన్ ను దక్కించుకున్న వారిలో, ఎన్సీపీ నేత శరద్ పవార్, బీజేపీ నేత మరళీ మనోహర్ జోషి, లెజండరీ సింగర్ కేజే ఏసుదాస్ వున్నారు. వీరితో పాటు దివంగత ముఫ్తీ మహమ్మద్ సయీద్, పీఏ సంగ్మా, సుందర్ లాల్ పత్వాలకు(మరణానంతరం) పద్మ విభూషణ్ లను కేంద్రం ప్రకటించింది.

ఇక పద్మశ్రీల విషయానికి వస్తే క్రీడారంగంలో రాణిస్తున్న విరాట్ కోహ్లీ, దీపా మాలిక్, దీపా కర్మాకర్, వికాస్ గౌడ, పీఆర్ శ్రీజేష్, పారా ఒలంపిక్స్ లో ఇండియా పేరు నిలబెట్టిన మరియప్పన్ తంగవేలు లకు లభించాయి.

ఇక ఎయిడ్స్ పై రీసెర్చ్ చేస్తున్న డాక్టర్ సునితీ సాలమన్, బాలీవుడ్ సినీ జర్నలిస్ట్ భావనా సోమయ్య, గాయని అనురాధా పౌడ్వాల్ లకు పద్మశ్రీ పురస్కారాలను కేంద్రం ప్రకటించింది. మీనాక్షీ అమ్మ, సుబత్రాదాస్, అనురాధా కోయిరాలా, కరీముల్ హక్, తదితరులు కూడా పద్మ పురస్కారాన్నిను కైవసం చేసుకున్నారు. ఖమ్మంకు చెందిన వనజీవి రామయ్యకు పద్మ అవార్డు దక్కింది. పూర్తి జాబితా బయటకు రావాల్సి ఉంది . 68వ గణతంత్ర్య వేడుకల సందర్భంగా ఆయా పురస్కారాలను అందజేస్తారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Padma Awards  2017  MS Dhoni  PV Sindhu  P Gopichand  Virat Kohli  

Other Articles