హలో మోదీజీ.. ఇక ట్రంఫ్ వంతు షురూ..! 'Conversation with Trump was warm' says PM Modi

Conversation with donald trump was warm invited him to india pm modi says

white house, US elections 2016, Narendra Modi, India-US ties, Bi-lateral talks, Donald Trump, PM Modi

After US President Donald Trump told PM Narendra Modi India is "a true friend" and invited him to visit the US, Modi tweeted their conversation was "warm" and that he also urged the US President to visit India.

మోదీతో డొనాల్డ్ ట్రంఫ్ ఏం మాట్లాడాడో తెలుసా..!

Posted: 01/25/2017 02:48 PM IST
Conversation with donald trump was warm invited him to india pm modi says

స్వదేశంలో పెల్లుబిక్కుతున్న తీవ్ర నిరసనల మద్య అమెరికా అధ్యక్షుడిగా ప్రమాణస్వీకారం చేసిన డొనాల్డ్‌ ట్రంప్‌.. పాలనపై తన ముద్రను వేసుకునే చర్యలకు పూనుకుంటున్నారు. అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టాక వరుసగా ప్రపంచంలోని వివిధ దేశాధినేతలతో మాట్లాడుతున్న ట్రంప్‌ తాజాగా భారత ప్రదానమంత్రి నరేంద్ర మోడీతో ఫోన్ ద్వారా మాట్లాడారు. ఇప్పటికే కెనడా, మెక్సికో, ఇజ్రాయెల్, ఈజిప్టు దేశాధినేతలకు ఫోన్  చేసి మాట్లాడిన ఆయన మంగళవారం రాత్రి ప్రధాని మోడీకి ఫోన్ చేసి పలు అంశాలపై చర్చించారు.

ఇరు దేశాల మధ్య సైనిక, ఆర్థిక రంగాల్లో భాగస్వామ్యం బలోపేతంపై చర్చించారు. వచ్చే ఏడాది మోదీని అమెరికా పర్యటనకు రావాలని ట్రంప్ ఆహ్వానించారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న సవాళ్లును అధిగమించడంలో భారత్ ఓ నిజమైన స్నేహితునిగా ట్రంప్ అభివర్ణించారు. భద్రతపరమైన అంశాలతో పాటు పలు కీలక అంశాలపై ఇరు నేతలు చర్చించినట్లు వైట్‌ హౌస్‌ కార్యాలయం విడుదల చేసిన ఓ ప్రకటనలో తెలిపింది. అధ్యక్షుడిగా ఎన్నికైతే భారత్, ఇజ్రాయెల్‌ సహా పలు దేశాలతో సంబంధాలు మరింత మెరుగుపడేలా కృషి చేస్తామంటూ ఎన్నికల ప్రచారంలో ట్రంప్‌ ప్రకటిన మేరకు ఆయన ప్రధానికి ఫోన్ చేశారు.

ఇదిలావుండగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తో ఫోన్ లో మాట్లాడటంపై ప్రధాని మోడీ కూడా ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. అధ్యక్షుడు ట్రంప్ తో మాట్లాడటం చాలా అత్మీయంగా వుందని ఆయన తెలిపారు. రానున్న రోజుల్లో భారత్-అమెరికాలు మరింత చేరువయ్యేందుకు తమ మద్య ద్వైపాక్షిక సంబంధాలను మరింత దృడంగా మార్చేందుకు దోహదపడుతుందని అన్నారు. పగ్గాలను చేపట్టిన ట్రంప్ కు మరోమారు శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని.. ఆయనను భారత దేశ పర్యటనకు రావాలని కూడా అహ్వానించినట్లు తెలిపారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : white house  US elections 2016  Narendra Modi  India-US ties  Bi-lateral talks  Donald Trump  PM Modi  

Other Articles