రైలు ప్రమాదంలో కుట్ర కోణం.. మావోలపై అనుమానం maoists behind Hirakhand Train Accident, suspects police

Maoists behind hirakhand train accident suspects police

Hirakhand Express, Jagdalpur Bhubaneswar Express, Hirakhand Express Accident, Hirakhand Express train derail, vizianagaram train derail, andhra pradesh train tragedy, Train accident, train derailmen

Maoists may be behind the derailment of the Hirakhand Express train in in Andhra Pradesh’s Vizianagaram district, that claimed lives of 34 people

రైలు ప్రమాదంలో కుట్ర కోణం.. మావోలపై అనుమానం

Posted: 01/22/2017 10:33 AM IST
Maoists behind hirakhand train accident suspects police

విజయనగరం జిల్లాలో ఘోర రైలు ప్రమాద ఘటనలో కుట్ర కోణం వుందా..? అన్న అనుమానాలను విజయనగరం పోలీసులు వ్యక్తం చేస్తున్నారు. రైలు పట్టా రెండు చోట్ల విరిగిపోవడం అనుమానాలకు తావిస్తుందని అంటున్నారు. గంటల ముందు వరకు ఆ మార్గంలో పలు రైళ్లు ప్రయాణించాయని, అయితే హరికండ్ ఎక్స్ ప్రెస్ కు పట్టాలు తప్పడంపై అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనకు కారణమైన వారిపై కఠిన చర్యలు ఉంటాయని రైల్వేశాఖ హెచ్చరించింది. ప్రమాదం వెనుక కుట్ర ఉన్నట్టు రైల్వేశాఖ అనుమానం వ్యక్తం చేస్తోంది. దర్యాప్తుకు ఆదేశించింది.

రైలు ప్రమాదం జరిగే ప్రాంతం నక్సల్స్‌ ప్రభావిత ప్రాంతం కావడంతో రైల్వే అధికారులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. సంఘటనా స్థలంలో అనుమానాస్పద పరికరం లభ్యం కావడంతో ఈ అనుమానాలు మరింత బలపడుతున్నాయి. రిపబ్లిక్ డే సందర్భంగా నక్సలైట్లు తమ ఉనికిని చాటేందుకు ఈ దుశ్చర్యకు పాల్పడి ఉండొచ్చన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.  విజయనగరం జిల్లా, కొమరాడ మండలం, కూనేరు రైల్వే స్టేషన్ వద్ద అర్థరాత్రి హిరాఖండ్ ఎక్స్‌ప్రెస్ రైలు పట్టాలు తప్పడంతో ఇప్పటివరకు 35 మంది మృతి చెందగా వంద మందికిపైగా గాయపడ్డారు.
 
ఈ దుర్ఘటనతో పలు రైళ్లను రద్దు చేయగా మరికొన్నింటిని దారి మళ్లించారు. విశాఖపట్నం-కోరాపుట్‌ల మధ్య తిరిగే ప్యాసింజర్‌ రైళ్లను అధికారులు రద్దు చేశారు. అలాగే విజయవాడ-రాయగఢ్ ప్యాసింజర్‌ రైళ్లను విశాఖపట్టణం వరకు కుదించారు. ధన్‌బాద్‌-అలెప్పి ఎక్స్‌ప్రెస్‌, హతియా-యశ్వంత్‌పూర్‌ ఎక్స్‌ప్రెస్‌లను టిట్లాగఢ్‌-రాయ్‌పూర్‌-నాగ్‌పూర్‌ మార్గంలో నడుపుతున్నారు. నాందేడ్ -సంబల్‌పూర్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలు కుర్దారోడ్డు-అంగుల్‌ మీదుగా మళ్లించారు. ప్రయాణికులు ఈ విషయాన్ని గమనించాలని రైల్వేశాఖ అధికారులు కోరారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Hirakhand Express  Jagdalpur Bhubaneswar Express  Vizianagaram  Andhra Pradesh  

Other Articles