రైలు ప్రమాదంపై ప్రధాని, సోనియా గాంధీ దిగ్భ్రాంతి .. PM Modi, Sonia gandhi condole Hirakhand Express train tragedy

Pm modi sonia gandhi condole hirakhand express train tragedy

Hirakhand Express, Jagdalpur Bhubaneswar Express, Hirakhand Express Accident, Hirakhand Express train derail, vizianagaram train derail, andhra pradesh train tragedy, Train accident, train derailmen

Prime Minister Narendra Modi on Sunday condoled the deaths of 34 people who were killed during a train derailment in Andhra Pradesh’s Vizianagaram district.

రైలు ప్రమాదంపై ప్రధాని, సోనియా గాంధీ దిగ్భ్రాంతి ..

Posted: 01/22/2017 10:03 AM IST
Pm modi sonia gandhi condole hirakhand express train tragedy

విజయనగరం జిల్లాలో ఘోర రైలు ప్రమాద ఘటనపై ప్రధాని నరేంద్రమోడీ తీవ్ర దిగ్బ్రాంథి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తం చేశారు. ఘటనలో క్షతగాత్రులను రక్షించేందుకు అధికారులు హుటాహుటిన చర్యలు తీసుకోవాలని అధికారులను అదేశించారు. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని సూచించారు. రైలు ప్రమాద ఘటనలో సహాయకచర్యలు ముమ్మరం చేయాలని రైల్వేశాఖ మంత్రి సురేశ్‌ ప్రభు అధికారులను ఆదేశించారు. ప్రమాద ఘటనపై ఆయన ఆరా తీశారు. ఈస్ట్‌ కోస్ట్‌ రైల్వే అధికారులతో సమీక్ష నిర్వహించారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యసేవలు అందించాలని సూచించారు.

రైలు ప్రమాద ఘటనపై ఏపీ సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. విజయనగరం, విశాఖ పోలీసులు సహాయక చర్యల్లో పాల్గొనాలన్నారు. గాయపడ్డ వారికి మెరుగైన వైద్యం అందేలా చూడాలని విజయనగరం, విశాఖ జిల్లా కలెక్టర్లకు బాబు ఆదేశించారు. మృతదేహాలను వారి స్వస్థలాలకు పంపేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఉత్తరాంధ్ర మంత్రులు ఘటనాస్థలానికి వెళ్లి పర్యవేక్షించాలని సీఎం ఆదేశించారు. రైలు ప్రమాద ఘటనపై కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ కూడా తీవ్ర విచారం వ్యక్తం చేశారు.

రైలు ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు అమె ప్రగాడ సానుభూతిని వ్యక్తం చేశారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యాన్ని అందించాలని, బాధితులకు తక్షణ సాయం కోసం చర్యలు చేపట్టాలని కోరారు. రాహుల్ గాంధీ కూడా ఈ ప్రమాధ ఘటనపై విచారం వ్యక్తం చేశారు. ఇటీవలకాలంలో పెరుగుతున్న రైలు ప్రమాద ఘటనపై అయన దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. ప్రయాణికుల సురక్షిత ప్రయాణానికి కావాల్సిన అన్ని చర్యలను రైల్వే శాఖ తీసుకోవాలని డిమాండ్ చేశారు.

ప్రమాద ఘటనపై ఏపీ ఆరోగ్యశాఖ మంత్రి కామినేని శ్రీనివాస్‌ స్పందించారు. ప్రమాద ఘటనపై రైల్వే మంత్రి సురేష్ ప్రభుతో మాట్లాడామని.. గాయపడిన క్షతగాత్రులకు మెరుగైన చికిత్స అందిస్తున్నామని తెలిపారు. విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల నుంచి మెడికల్ టీమ్స్‌ను రంగంలోకి దించామన్నారు. పార్వతీపురం నుంచి 30, విజయనగరం నుంచి 7 వైద్య బృందాలతో సహా మొత్తం 37 వైద్య బృందాలు ఘటనాస్థలి వద్ద సహాయక చర్యల్లో పాల్గొన్నాయన్నారు. విశాఖ కేజీహెచ్‌లో క్షతగాత్రులకు జాప్యం లేకుండా వైద్యం అందిస్తున్నామని కామినేని చెప్పారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles

Today on Telugu Wishesh