అర్థరాత్రి విషాదం.. విజయనగరంలో ఘోర రైలు ప్రమాదం Hirakhand Train Accident in vizianagaram 25 Killed

Hirakhand train accident in vizianagaram 25 killed

Hirakhand Express, Jagdalpur Bhubaneswar Express, Hirakhand Express Accident, Hirakhand Express train derail, vizianagaram train derail, andhra pradesh train tragedy, Train accident, train derailmen

Jagdalpur-Bhubaneswar Hirakhand Express derailed in Andhra Pradesh's Vizianagaram district, in wihich 25 people killed and many injured

అర్థరాత్రి విషాదం.. విజయనగరంలో ఘోర రైలు ప్రమాదం

Posted: 01/22/2017 09:30 AM IST
Hirakhand train accident in vizianagaram 25 killed

విజయనగరం జిల్లాలో ఘోర రైలు ప్రమాదం జరిగింది. జగదల్ పూర్ నుంచి భువనేశ్వర్ వెళుతున్న హీరాఖండ్ ఎక్స్ ప్రెస్ కొమరాడ మండలం కూనేరు వద్ద పట్టాలు తప్పింది. నిన్న రాత్రి 11:30 గంటల సమయంలో ఈ ప్రమాదం జరుగగా, ఈ ప్రమాదంలో ఘటనాస్థలంలోనే 25 మందికి పైగా ప్రమాణికులు అసువులు బాసినట్లు సమాచారం. కాగా, మరో 100 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. ప్రయాణికులు నిద్రలోకి జారుకున్న క్రమంలో ఈ దారుణం జరగడంతో మృతుల సంఖ్య మరింతగా పెరిగే అవకాశాలు ఉన్నాయి. రెండు ఏసీ బోగీలు, రెండు రిజర్వేషన్, రెండు జనరల్, గార్డు బోగీలు పట్టాలు తప్పాయి.

ఎస్ 8, ఎస్ 9 స్లీపర్ బోగీలు బాగా దెబ్బతిన్నాయి. విషయం తెలుసుకున్న సహాయక బృందాలు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలను ముమ్మరం చేశాయి. వాల్తేరు డివిజనల్‌ రైల్వే మేనేజర్‌ చంద్రలేఖ ముఖర్జీ మెడికల్‌ రిలీఫ్‌ ట్రైన్‌ తో చేరుకున్నారు. గాయపడ్డ వారిని పార్వతీపురం, రాయ్ గఢ్, విశాఖ ఆసుపత్రులకు తరలించారు. మృతులు, గాయపడిన వారి బంధువులకు సమాచారాన్ని అందించేందుకు హెల్ప్ లైన్ నంబర్లు 8106053006, 8500358712లను ఏర్పాటు చేసినట్టు అధికారులు తెలిపారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles

Today on Telugu Wishesh