ఎమ్మెల్యేసారూ.. కాళ్లు మొక్కుతా.. వదిలేయండీ.. BJP MLA asks junior engineer to touch feet for removing car

Bjp mla asks junior engineer to touch feet for removing car

bjp mla, jayantha das, junior engineer, Assam, Dimbeswar Das, Assam legislator, Touching feet, Apology

A junior engineer allegedly got an MLA’s car removed that was blocking the road to an office and was subsequently forced to apologise for his action by touching the lawmaker’s feet.

ఎమ్మెల్యేసారూ.. కాళ్లు మొక్కుతా.. వదిలేయండీ..

Posted: 01/21/2017 07:14 PM IST
Bjp mla asks junior engineer to touch feet for removing car

కార్యాలయ గేటుకు అడ్డుగా నిలిపిన ఎమ్మెల్యే కారును అక్కడి నుంచి తొలగించినందుకు ఓ ప్రభుత్వ ఉద్యోగి క్షమాపణలు చెప్పాల్సి వచ్చింది. ఈ ఘటన అస్సాం రాష్ట్రంలో గల నాగావ్‌ జిల్లా రాహా నియోజకవర్గంలో చోటు చేసుకుంది. కొటియాటోలి డెవలప్‌మెంట్‌ బ్లాక్‌లో జయంత దాస్‌ జూనియర్‌ ఇంజనీర్‌గా విధులు నిర్వహిస్తున్నారు. గురువారం ఈ నియోజకవర్గం నుంచి గెలుపొందిన బీజేపీ ఎమ్మెల్యే దింబేశ్వర్‌ దాస్‌ ఇన్‌స్పెక్షన్‌కు కొటియాటోలి డెవలప్‌మెంట్‌ బ్లాక్‌కు వెళ్లారు.
 
ఈ సమయంలో కారును కార్యాలయ ద్వారానికి అడ్డంగా నిలిపేశారు. ఇది గమనించిన జయంత దాస్‌ కారును గేటుకు అడ్డంగా తీసేయించినట్లు సమాచారం. దీంతో జయంతపై కోపగించుకున్న ఎమ్మెల్యే అనుచరులు ఆయనకు జరిగిన విషయాన్ని చెప్పారు. ఆగ్రహించిన ఎమ్మెల్యే ఇంజనీర్‌ను ఇష్టం వచ్చినట్లు తిట్టారు. దాంతో క్షమించాలంటూ జయంత ఎమ్మెల్యే కాళ్లు పట్టుకున్నారు. ఈ ఘటనను మొత్తం టీవీ చానెళ్లు చిత్రీకరించాయి. కాగా, ఇంజనీర్‌తో కాళ్లు పట్టించుకోవడంపై ఎమ్మెల్యేను మీడియా ప్రశ్నించగా అలాంటిదేం జరగలేదని దింబేశ్వర్‌ సమాధానం ఇచ్చారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : bjp mla  jayantha das  junior engineer  Assam  Dimbeswar Das  Assam legislator  Touching feet  Apology  

Other Articles