పెళ్లి టైంకి కన్యగా ఉండాల్సిందే అమ్మాయిలే: బాంబే కోర్టు | బాధ్యత మహిళ Educated girl can't cry rape if ditched by boyfriend, says High Court

Educated women consenting to pre marital sex cannot allege rape in every case bombay high court

Justice Mridula Bhatkar, Bhatkar, rape case, anticipatory bail, sex before marriage, educated girls, woman judge, bombay high court, crime news

Bombay High Court bench granted pre-arrest bail to a man, who was accused of rape for convincing a woman to have physical relations with him by promising to marry her.

ప్రియుడు చేతిలో మోసపోతే అత్యాచారం కాదు

Posted: 01/21/2017 04:35 PM IST
Educated women consenting to pre marital sex cannot allege rape in every case bombay high court

అత్యాచారం వేరు.. ప్రియుడి చేతిలో మోసపోవడం వేరు అంటూ బాంబే హైకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. ముఖ్యంగా చదువుకున్న యువతులు ప్రేమాంధకారంలో తమ సర్వస్వం ప్రియుడికి అర్పించి.. అతను పెళ్లి చేసుకోనని చెప్పగానే వారిపై అత్యాచారం కింద కేసులు బనాయిస్తున్నారని ఇది మోసం కిందకు వస్తుందే కానీ అత్యాచారం కిందకు రాదని తేల్చిచెప్పింది. ఇలాంటి ప్రతి సందర్భంలోనూ దాన్ని అత్యాచారంగా పరిగణించలేమని బాంబే హైకోర్టు మహిళా న్యాయమూర్తి సంచలన వ్యాఖ్యలు చేశారు.

21 ఏళ్ల యువకుడికి ముందస్తు బెయిల్ మంజూరు చేసే సందర్భంగా ఆమె ఇలా అన్నారు. మాజీ గర్ల్‌ఫ్రెండ్‌తో అతడు విడిపోయిన తర్వాత ఆమె అతడిపై రేప్ కేసు పెట్టగా, చదువుకున్న అమ్మాయిలు పెళ్లికి ముందు లైంగిక సంబంధం పెట్టుకునే ముందు తమ నిర్ణయానికి తామే బాధ్యత తీసుకోవాలని జస్టిస్ మృదులా భత్కర్ చెప్పారు. ఒకవేళ మోసం చేసి అంగీకారం పొందితే మాత్రం అప్పుడు కోర్టును ఆశ్రయించవచ్చని అన్నారు. ఆమెను బలవంతంగా శృంగారానికి ఒప్పించారని చెప్పేందుకు బలమైన సాక్ష్యాలు ఉండాలని తెలిపారు.
 
పెళ్లి చేసుకుంటానని హామీ ఇవ్వడం అనే విషయం మాత్రం ఇలాంటి కేసుల్లో నిలబడదని జస్టిస్ మృదులా భత్కర్ స్పష్టం చేశారు. సమాజం శరవేగంగా మారుతున్నా, ఇప్పటికీ నైతిక విలువలు మాత్రం అలాగే ఉన్నాయని ఆమె చెప్పారు. పెళ్లి సమయానికి కన్యగానే ఉండాల్సిన బాధ్యత మహిళపై ఉందన్న నైతిక సూత్రం తరతరాలుగా మన దేశంలో ఉందని, అయితే ప్రస్తుత యువతరం మాత్రం పలువురితో మాట్లాడుతూ లైంగిక కార్యకలాపాల గురించి బాగా తెలుసుకుంటున్నారని అన్నారు.

సమాజం స్వేచ్ఛాయుతం కావడానికి ప్రయత్నిస్తోంది గానీ నైతిక విలువల విషయంలో ఏం చేయాలో అర్థం కావట్లేదన్నారు. అబ్బాయితో ప్రేమలో ఉన్నప్పుడు అతడితో శృంగారంలో పాల్గొనాలా వద్దా అనేది ఇద్దరూ ఆలోచించి తీసుకోవాల్సిన నిర్ణయమని, అలాంటప్పుడు తాను తీసుకున్న నిర్ణయానికి బాధ్యత వహించాలన్న విషయాన్ని వాళ్లు మర్చిపోతున్నారని జస్టిస్ భత్కర్ అన్నారు. అమ్మాయిలు పెద్దవాళ్లయి, చదువు కూడా ఉన్నప్పుపడు పెళ్లికి ముందు సంబంధాల వల్ల వచ్చే ఫలితాల గురించి కూడా ఆలోచించాలని చెప్పారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles