తమిళనాడులో ఇక అధికారికంగా జల్లికట్టు.. Jallikattu Returns As Tamil Nadu Governor Approves Ordinance

Tamil nadu cm to inaugurate jallikattu celebrations in alanganallur

Jallikattu, ordinance, Vidyasagar Rao, O Panneerselvam, Governor, Marina Beach, Alanganallur, Madurai, Jallikattu ban, Jallikattu ordinance, Jallikattu protests, chennai, Tamil Nadu

After a three year long ban, Jallikattu will finally be held across Tamil Nadu. Chief Minister O Panneerselvam is now headed to Alanganallur in Madurai to inaugurate Jallikattu celebrations

తమిళనాడులో అధికారిక జల్లికట్టుకు ముహూర్తం కుదిరింది..

Posted: 01/21/2017 05:17 PM IST
Tamil nadu cm to inaugurate jallikattu celebrations in alanganallur

తమిళనాడులో అధికారికంగా జల్లికట్టు క్రీడను రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించనుంది. ఇందుకోసం తమిళనాడు ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం మైసూరుకు చేరువలో వున్న తమ రాష్ట్రం అళంగనలూర్లో ఈ ఆటను అధికారికంగా ప్రారంభించనున్నారు. ఇందుకోసం ఆయన ఇవాళే బయలుదేరి మైసూరుకు చేరుకుని అక్కడి నుంచి అళంగనటూర్ కు చేరుకోనున్నారు. అధివారం ఉదయం 10 గంటలకు ప్రారంభించనున్నారు. అదేవిధంగా రాష్ట్ర మంత్రులు కూడా వారి సంబంధిత జిల్లాలో జల్లికట్టు ఆటకు స్వీకారం చుట్టనున్నారు.
 
సంప్రదాయ జల్లికట్టు క్రీడపై సుప్రీంకోర్టు విధించిన నిషేధాన్ని నిలిపివేసేలా రూపొందించిన ఆర్డినెన్స్కు తమిళనాడు ఇన్‌చార్జి గవర్నర్ విద్యాసాగర్ రావు ఆమోదం తెలపడంతో రాష్ట్ర ప్రభుత్వం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. కాగా సంప్రదాయ క్రీడ జల్లికట్టును పునరుద్ధరించాలంటూ గడిచిన ఐదు రోజులుగా తమిళనాడు వ్యాప్తంగా కొనసాగుతున్న నిరసనల నేపథ్యంలో దిగివచ్చిన కేంద్రప్రభుత్వం.. క్రితం రోజునే జల్లికట్టు ఆర్డినెన్స్‌కు పచ్చజెండా ఊపింది. తమిళనాడు ప్రభుత్వం రూపొందించిన ఆర్డినెన్స్‌ ముసాయిదాలో కొద్దిపాటి మార్పులుచేసి కేంద్ర హోం, న్యాయ, పర్యావరణ మంత్రిత్వ శాఖలు ఆమోదించాయి.
 
అనంతరం ఆ ఆర్డినెన్స్ను తిరిగి రాష్ట్రానికి పంపగా, దానిని గవర్నర్ విద్యాసాగర్ రావు అమోదించారు. ఈ ఆర్డినెన్స్‌ ద్వారా జంతుహింస నిరోధక చట్టాన్ని సవరించి, అందులోని ‘ప్రదర్శన జంతువులు(పర్‌ఫామింగ్‌ యానిమల్స్‌)' జాబితా నుంచి ఎద్దులను తొలగిస్తారు. ఈ ఆర్డినెన్స్ను జనవరి 23 నుంచి జరుగబోయే తొలి అసెంబ్లీ సమావేశాల్లో ప్రవేశపెట్టనున్నారు. సీఎం పన్నీర్‌ సెల్వం పలు మార్లు విజ్ఞప్తి చేసినా వెనక్కి తగ్గని నిరసనకారులు.. ఆర్డినెన్స్‌కు ఆమోదం లభించడంతో ఆందోళనలు విరమించే అవకాశంఉంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles