నగదు రహిత లావాదేవీలపై అర్బీఐ కీలక నిర్ణయాలు Cash Situation Back To Normal Soon, RBI Chief Urjit Patel

Working on ways to reduce transaction cost rbi tells pac

RBI, parliamentary panel, pac pannel, digital economy, digital transaction cost, online payments, BJP members protested Chairman, K V Thomas, demonetisation

RBI today informed a parliamentary panel that it is working on a mechanism to bring down transaction cost on online payments

నగదు రహిత లావాదేవీలపై అర్బీఐ కీలక నిర్ణయాలు

Posted: 01/20/2017 07:22 PM IST
Working on ways to reduce transaction cost rbi tells pac

డిజిటల్ ఇండియాలో భాగంగా క్యాష్ లెస్ ఎకానమీ వైపు భారతావనిని నడిపించేందుకు కొత్త ప్రణాళికలను తీసుకువన్తున్నట్లు భారతీయ సెంట్రల్ బ్యాంక్ అర్బీఐ పార్లమెంటరీ పబ్లిక్ అకౌంట్స్ కమిటీకి తెలిపింది. ఈ ప్రణాళికలలో భాగంగా నగదు రహిత లావాదేవీలను పెంచేందుకు గాను వాటిపై వసూలు చేస్తున్న చార్జీలను కుదించాలని భారతీయ రిజర్వు బ్యాంకు ప్రణాళికలు చేస్తుందని అర్బీఐ గవర్నర్ ఉర్జీత్ పటేల్ పిఏసీ కమిటీ దృష్టికి తీసుకువచ్చారు.

కరెన్సీ నోట్ల వినియోగాన్ని తగ్గించి.. నగదు రహిత లావాదేవీల వైపు ప్రజలను ప్రోత్సహించటానికి పలు నిర్ణయాలు తీసుకోబోతోంది. నోట్ల రద్దు తర్వాత గత్యంతరం లేక అందరూ డిజిటల్ లావాదేవీలు చేశారు. చార్జీల మోతతో జనం బెంబేలెత్తారు. నగదు అందుబాటులోకి వచ్చే కొద్దీ.. ఆన్ లైన్ ట్రాన్సాక్షన్స్ తగ్గిపోయాయి. దీన్ని గుర్తించిన కేంద్రం, RBI.. చార్జీలను తగ్గించటానికి నిర్ణయం తీసుకుంది. ఈ దిశగా ఇప్పటికే చర్యలు చేపట్టింది రిజర్వ్ బ్యాంక్. అన్ని బ్యాంకులతో చర్చిస్తోంది.

ఆన్ లైన్ లో 100 రూపాయల సినిమా టికెట్ కొంటే.. ఇంటర్నెట్ హ్యాండ్లింగ్ చార్జీస్ కింద రూ.6.90పైసలు, పేమెంట్ గేట్ వే చార్జీలు రూ.7.30 వసూలు చేస్తున్నారు. ఓ కుటుంబం ఆన్ లైన్ బుకింగ్ తో సినిమాకు వెళ్లాలంటే రూ.400 సినిమా టికెట్స్ అయితే.. అదనంగా 50 రూపాయలు ఆన్ లైన్ చార్జీల కింద చెల్లించాల్సి వస్తోంది. మల్టీఫ్లెక్సీల్లో కనీస టికెట్ రేటు రూ.150. నాలుగు టికెట్స్ కొంటే.. వంద రూపాయల వరకు చార్జీల బాదుడు ఉంటుంది. దీంతో జనం క్యాష్ ట్రాన్సాక్షన్ కే మొగ్గుచూపుతున్నారు. ఈ విషయాన్ని గ్రహించిన RBI.. బ్యాంకు ఆన్ లైన్ చార్జీలను కనీసం సగానికి తగ్గించాలని భావిస్తుంది. ఇప్పటికే చర్చలు జరుగుతున్న RBI.. నెలాఖరులోపు గుడ్ న్యూస్ అధికారికంగా వెల్లడించే అవకాశం ఉంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : RBI  parliamentary panel  pac pannel  digital economy  K V Thomas  demonetisation  

Other Articles

Today on Telugu Wishesh