భార్యతో శృంగారం కోసం.. బొద్దింకలు A techie's creepy, crawly sex life

Creepy husband harassed wife with cockroaches for sex

Avinash Sharma, Sujatha, Bengaluru woman, cockroaches, techie creepy, crawly sex life, husband harassment, Vanitha Sahayavani, ms safiya, Indiranagar, bs saraswathi, bannerghatta road, domestic violence, sex, crime

A resident of Indiranagar has approached the police with a complaint that her husband, a 40-year-old techie, regularly uses cockroaches to get in bed with her.

భార్యతో శృంగారం కోసం.. బొద్దింకలు

Posted: 01/20/2017 07:09 PM IST
Creepy husband harassed wife with cockroaches for sex

భార్యభర్తలు దాంపత్య జీవితం, సుఖమయ సంసారంలో శృంగారం కూడా ఒక భాగమే. అయితే శృంగార రసం లేని సంసారాలు కూడా సజావుగానే సాగుతున్నాయి. కాగా, శృంగారం కోసమే సంపారాన్ని లాగతున్న భర్తలు కూడా లేకపోలేదు. తన భార్య తనతో శృంగారానికి అంగీకరించడం లేదని కసిపెంచుకున్న భర్త.. అమె పైశాచికంగా ప్రవర్తించాడు. బాగా చదుపుకుని ఐటీ రాజధాని బెంగుళూరులోని ఓ సాప్ట్ వేర్ సంస్థలో ఇంజనీర్ గా విధులు నిర్వర్తిస్తున్న ప్రబుద్దిడి ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది.

భర్త పెట్టే చిత్ర హింసలను కొన్నాళ్లుగా భరిస్తున్న భార్య ఇక తన వల్ల కాదంటూ.. అతడిపై పోలీసులకు పిర్యాదు చేసింది. నగరంలోని బన్నేరుఘట్టలో ఓ సాఫ్ట్‌వేర్‌ సంస్థలో ఇంజనీరైన అవినాశ్‌ శర్మ పదేళ్ల క్రితం తన క్లాస్‌మేట్‌ సూజాతను ప్రేమించాడు. అయితే అప్పటికే తనకు వేరే యువతితో వివాహం నిశ్చయమైంది. దీంతో వేరే యువతిని పెళ్లి చేసుకున్నాక.. పలు కారణాలతో అ వివాహబంధం ఏడాది కూడా తిరగకుండానే పెటాకులైంది. దీంతో అప్పటికే తాను ప్రేమించిన సుజాతా వివాహం చేసుకున్నాడు. ఆమె కూడా ఓ సాఫ్ట్‌వేర్‌ సంస్థలో ఇంజనీర్‌.

అవినాశ్‌ తనతో పాటు మరికొందరి యువతులతో అక్రమ సంబంధాలు పెట్టుకున్నాడని తెలుసుకున్న సుజాత హతాశురాలైంది. భర్తను అక్రమ సంబంధాలపై నిలదీసింది. అయినా తన బుద్ది మార్చుకోని అవినాశ్ తన ఇష్టానుసారంగా ప్రవర్తించేవాడని.. దీంతో తమ మధ్య గొడవలు జరుగుతున్నాయని పేర్కోంది. అవినాశ్‌ ప్రవర్తన నచ్చక ఆమె దగ్గరకు రానివ్వడం లేదు. అతను ఎన్ని వెదవ వేషాలు వేసినా.. ఎంత బలవంతం చేసినా అతనికి దూరంగానే వుండేది.

మొదట్లో తమ ఇద్దరు పిల్లల బాగు కోసం భర్త వేధింపులను ఓర్చుకున్న ఆమె రోజురోజుకూ వేధింపులు తీవ్రం కావడం తో పోలీసులకు ఫిర్యాదు చేసింది.  పోలీసులు కేసును మహిళా సహాయ వాణికి బదిలీ దీంతో ఎలాగైనా తన దారికి తెచ్చుకోవాలనుకున్న అవినాశ్‌ తన భార్యపై బొద్దింకలను వదులుతూ భయపెట్టేవాడు. తనతో శృంగారంలో పాల్గొనకుంటే ఇంతేనని వేధించడం ప్రారంభించాడు.చేశారు. నిందతుణ్ని పిలిపించి విచారించగా శృంగారం లో తనకు సహకరించకపోవడం తోనే బొద్దింకలు వదులుతూ వేధించినట్లు చెప్పాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Avinash Sharma  Sujatha  Bengaluru woman  cockroaches  techie creepy  crawly sex life  sex  crime  

Other Articles