యూపీలో ఘోర రోడ్డు ప్రమాదం.. 25 మంది విద్యార్థుల మృతి Etah Road Accident: 25 School Children Killed, 40 Injured in UP

Etah road accident 25 school children killed 30 injured in up

JS Vidya School, Etah Road Accident, Etah road mishap, Road Accident in Etah, school bus, road accident, Uttar Pradesh, crime news

Over twenty five school children were feared dead and 40 others injured in a tragic road accident on Thursday morning in Etah district of Uttar Pradesh.

యూపీలో ఘోర రోడ్డు ప్రమాదం.. 25 మంది విద్యార్థుల మృతి

Posted: 01/19/2017 11:03 AM IST
Etah road accident 25 school children killed 30 injured in up

ఉత్తరప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. గురువారం ఉదయం పాఠశాలకు విద్యార్థులను తీసుకెళ్తున్న స్కూలు బస్సును ఎదరుగా వస్తున్న ట్రక్కు ఢీ కొనడంతో ప్రమాదం సంభవించింది. ఉత్తర్ ప్రదేశ్ లోని ఎతాహ్‌ జిల్లా అలీగంజ్ పట్టణంలో ఈ ప్రమాదం జరిగింది. వేగంగా వస్తున్న ట్రక్కు ఫ్రైవేటు స్కూలు బస్సును ఎదురుగా ఢీకొన్నడంతో బస్సులో ప్రయాణిస్తున్న 15 మంది విద్యార్థులు మరణించగా, మరో 20 మంది తీవ్రంగా గాయపడ్డారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశముంది.

ట్రక్కును ఢీకొన్న తర్వాత బస్సు రోడ్డు పక్కకు పల్టీలు కొట్టింది. పోలీసులు, అధికారులు వెంటనే ప్రమాద స్థలానికి వెళ్లి సహాయక చర్యలు చేప్టటారు. గాయపడ్డ విద్యార్థులను సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. చిన్నారుల మృతితో ఘటనాస్థలితో పాటు అసుపత్రి అవరణ ఆసాంతం విషాద ఛాయలు అలుముకున్నాయి. తల్లిదండ్రులు, బంధులు అర్తనాధాలతో ఆ ప్రాంతమంతా శోకసంద్రాన్ని తలపించింది. ప్రమాదానికి గల కారణాలేంటి? బస్సు ఎక్కడికి వెళ్తోంది? వంటి విషయాలు తెలియాల్సివుంది. అయితే రోడ్డు ప్రమాదానికి మంచు కారణమని తెలుస్తుంది. మంచు కారణంగా ఎదురుగా వస్తున్న వాహనం కనిపించకపోవడంతో ఈ ప్రమాదం సంభవించినట్లు స్థానికులు తెలిపారు.

కాగా ఘటనాస్థలంలో 8 మంది విద్యార్థులు మృత్యువాత పడగా, మరో 7 మంది విద్యార్థులు అస్పత్రిలో మరణించినట్లు వైద్యులు తెలిపారు. వీరు మార్గమధ్యంలో మరణించినట్లు పోలీసులు తెలిపారు. ఘటనాస్థానాన్ని పరిశీలించిన ఉత్తర్ ప్రదేశ్ డీజీపీ జావెద్ అహ్మద్ పాఠశాలపై చర్యలు తీసుకుంటామన్నారు. ఉత్తర్ ప్రదేశ్ లో చల్లగాలులు అధికంగా వీస్తుండటంతో పాఠశాలలకు సెలవులను ప్రకటించినా.. నిభంధనలకు విరుద్దంగా పాఠశాలను నడిపించి.. 15 మంది విద్యార్థులు ప్రాణాలను పాఠశాల యాజమాన్యం బలిగొనిందని జావెద్ అహ్మద్ అన్నారు.

ప్రధాని మోడీ, ముఖ్యమంత్రి అఖిలేష్ సంతాపం

ఉత్తర్ ప్రదేశ్ లోని ఎతాహ్‌ జిల్లా అలీగంజ్ పట్టణంలో సంభవించిన రోడ్డు ప్రమాదంపై ప్రధానమంత్రి నరేంద్రమోడీ విచారం వ్యక్తం చేశారు. ఈ ప్రమాదంలో బిడ్డలను కొల్పోయిన కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిన వ్యక్తం చేసిన ప్రధాని, వారి మనోవేధనను తాను అర్థు చేసుకున్నట్లు తెలిపారు. ప్రమాదంలో గాయాలపాలైన చిన్నారి విద్యార్థులు త్వరగా కోలుకోవాలని అకాంక్షించారు. మరోవైపు ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ కూడా మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సంతాపాన్ని తెలిపారు. ఘటనపై విచారణకు అదేశించిన ఆయన.. క్షతగాత్రులకు అధునాతన చికిత్సను అందించాలని అస్పత్రులను అదేశించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles