బీఎస్ఎన్ఎల్ కూడా ఆ జాబితాలో చేరిపోయింది.. BSNL new wallet for telugu states people

Bsnl new wallet for telugu states people

bsnl wallet, bsnl wallet for telugu states, bsnl cash in, bsnl cash out, bsnl wallet to wallet transfer, bsnl cash deposits, bsnl cash payments, bsnl, telugu states, andhra pradesh, Telangana, wallet, sbi

BSNL a government telecom service brought a wallet for the service of telugu states people for cash transactions

బీఎస్ఎన్ఎల్ కూడా ఆ జాబితాలో చేరిపోయింది..

Posted: 01/18/2017 10:54 AM IST
Bsnl new wallet for telugu states people

ప్రభుత్వ టెలికాం సంస్థ బీఎస్ఎన్ఎల్ కూడా ఆ జాబితాలోకి చేరిపోయింది. అవినీతి, నల్లధనం నిర్మూలణకు కేంద్ర ప్రభుత్వం తీసుకున్న డీమానిటైజేషన్ చర్యతో పాటు ఇకపై లావాదేవీలన్నీంటిని డిజిటల్ ద్వారాలనే జరపాలని నిర్ణయించిన క్రమంలో అప్పటి వరకు వున్న వాలెట్ సేవలందించే సంస్థలు భారీ లాభాలను అందుకున్న మాట నిజం. అయితే ప్రైవేటు వాలెట్ సంస్థలకు వచ్చిన అధరణ చూసిన ప్రభుత్వ టెలికాం సంస్థ బిఎస్ఎన్ఎల్ కూడా తమ కస్టమర్లను అకర్షించే క్రమంలో వాటికి ధీటుగా వాలెట్ సౌకర్యాన్ని తీసుకువచ్చింది.

ఇప్పటికే ఎయిర్ టెల్ వంటి సంస్థలు వాలెట్ సేవలను అందుబాటులోకి తీసుకురావడంతో.. బీఎస్ఎన్ఎల్ కూడా ఆ జాబితాలోకి చేరింది. తమ కస్టమర్లకు ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల వినియోగాదారుల కోసం మొబైల్ వాలెట్ సేవ‌ల‌ను తెలుగు రాష్ట్రాల్లో ప్రారంభించింది.  స్టేట్‌బ్యాంక్ ఆఫ్ ఇండియాతో క‌లిసి ఈ వాలెట్‌ను రూపొందించింది. బిఎస్ఎన్ఎల్ మొబైల్ వాలెట్‌తో ఇక‌పై లావాదేవీలు జ‌ర‌పొచ్చు. ఇందులో క్యాష్ ఇన్ క్యాష్ అవుట్ అనే ఫీచ‌ర్ ద్వారా డ‌బ్బులను విత్‌డ్రా చేయ‌డంతో పాటు డిపాజిట్ కూడా చేసే అవ‌కాశం క‌ల్పించింది.

ప్రస్తుతం బిఎస్ఎన్ఎల్ మొబైల్ వాలెట్ ఉప‌యోగించి ప్రీపెయిడ్ టాప్ అప్స్‌తోపాటు, పోస్ట్ పెయిడ్ బిల్స్‌ను కూడా చెల్లించే అవ‌కాశం క‌ల్పించడంతోపాటు వాలెట్ టూ వాలెట్ ట్రాన్స్‌ఫ‌ర్, వాలెట్ టూ బ్యాంక్ ట్రాన్స్‌ఫ‌ర్ చేసుకోవ‌చ్చ‌ని తెలంగాణ స‌ర్కిల్ చీఫ్ జ‌న‌ర‌ల్ మేనేజ‌ర్ అనంత‌రామ్ తెలిపారు. సెకండ్ ఫేజ్‌లో బిఎస్ఎన్ఎల్ మొబైల్ వాలెట్ ద్వారా అన్ని యూటిలిటీ బిల్లులు, మ‌ర్చంట్ పేమెంట్స్, ఇత‌ర టెలికాం నెట్‌వ‌ర్క్‌ల‌కు సంబంధించి పోస్ట్‌పెయిడ్ బిల్లులు చెల్లింపులు చేసేలా అభివృద్ధి చేస్తామ‌ని అనంత రామ్ చెప్పారు. బిఎస్ఎన్ఎల్ మొబైల్ వాలెట్ లోడ్ చేసుకోవాలంటే ద‌గ్గర‌లోని ఆథ‌రైజ్డ్ బీఎస్ఎన్ఎల్ స్టోర్‌లో కానీ , వెండ‌ర్స్‌ వ‌ద్ద కానీ వెళ్లి డ‌బ్బులు డిపాజిట్ చేసి లోడ్ చేసుకోవ‌చ్చని చీఫ్ జ‌న‌ర‌ల్ మేనేజ‌ర్ అనంత‌రామ్ వెల్ల‌డించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : bsnl  telugu states  andhra pradesh  Telangana  wallet  sbi  

Other Articles