కాలేజీల అక్రమాలకు చెక్.. అన్ లైన్ లోనే ఇంటర్ ప్రాక్టికల్స్.. telangana government to conduct inter practicals online

Telangana government to conduct inter practicals online

inter collages practical exams, intermediate collages management, Intermediate, practical exams, online practical exams, telangana intermediate board, Telangana

keeping a check on collage managements illegal process, telangana government to conduct inter practicals online

కాలేజీల అక్రమాలకు చెక్.. అన్ లైన్ లోనే ఇంటర్ ప్రాక్టికల్స్..

Posted: 01/18/2017 11:06 AM IST
Telangana government to conduct inter practicals online

తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు కొత్త పంథాకు శ్రీకారం చుట్టింది. ఇకపై ఇంటర్ ద్వీతీయ సంవత్సరంలో నిర్వహించే ప్రాక్టికల్ పరీక్షలను కూడా అన్ లైన్ విధానంలో నిర్వహించనుంది. ఇప్పటికే ప్రాక్టికల్  పరీక్షల కోసం పకడ్బందీ ఏర్పాట్లు చేపట్టిన బోర్డు ఈ పరీక్షల నిర్వహణకు కూడా ఆన్ లైన్ విధానం అనుసరిస్తోంది. ప్రైవేటు కాలేజీ యాజమాన్యాలు ప్రాక్టీకల్ పరీక్షలలో అవలంభిస్తున్న అక్రమ మార్గాలపై పలు పిర్యాదులను స్వీకరించిన బోర్డు.. ఈ ఏఢాది నుంచి సరికొత్తగా అన్ లైన్ విధానాన్ని ప్రవేశపెట్టనుంది.

దీంతో పరీక్ష పేపర్ లీక్, విద్యార్థుల నుంచి డబ్బులు వసూళ్లు చేసి వారికి అనుకూలంగా మార్కులు వేయడం వంటి అక్రమ విధానాలకు చెక్ పెట్టనుంది. ఫిబ్రవరి 2 నుంచి ప్రాక్టికల్ పరీక్షలను చేపట్టనున్న తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు.. పరీక్షల కోసం ఇప్పటికే ముమ్మర ఏర్పాట్లను చేయడంతో పాటు పరీక్షా కేంద్రాల్లో ఎలాంటి అవకతవకలు జరగకుండా పకడ్భంధీ చర్యలను కూడా తీసుకుంది. ఇందుకోసం పరీక్షా కేంద్రాల వద్ద, కేంద్రాల లోపల సిసి కెమెరాలతో పహారాను కూడా ఏర్పాటు చేసింది.

ప్రాక్టికల్స్ పూర్తయిన రెండు గంటల వ్యవధిలోనే మార్కులు కేటాయించాలని అదేశాలను జారీ చేసిన బోర్డు.. ఆ వెనువెంటనే మార్కుల వివరాలను ఇంటర్మీడియట్ బోర్డు వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేసేలా చర్యలను తీసుకోవాలని కూడా అదేశించింది. నిర్ణీత సమయం ముగిసిన తరువాత బోర్డు వెబ్‌సైట్ క్లోజ్ అవుతుందని.. ఆ లోపు మాత్రమే విద్యార్థుల మార్కులను అప్ లోడ్ చేయాలని సూచించింది. విద్యార్థుల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని అందరికీ అందుబాటులో, వేగంగా పనులను చక్కదిద్దేందుకు ఉద్దేశించి ఆన్‌లైన్ సేవలను ఇంటర్మీడియట్ బోర్డు అందుబాటులోకి తీసుకువచ్చింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles