ఏపీ పునర్విభజన చట్టంపై నల్లారి పిటిషన్, సుప్రీం సానుకూల స్పందన.. ఏం జరగబోతుందో? | Nallari Kiran Kumar Reddy again in news.

Kiran kumar petition on andhra pradesh reorganisation bill

Nallari Kiran Kumar Reddy, AP re organisation bill, Supreme Court, Petition, Supreme Court on AP re organisation, Supreme Court Andhra Pradesh,Kiran Kumar petition, KIran Kumar Raghurama Krishnamraju, Petition on AP re organisation, AP Politicians, AP Bifurcation Act

Supreme Court accept former CM Nallari Kiran Kumar Reddy petition on AP re organization bill. and ordered Central to submit affidavit. AP Politicians File Petition in Supreme Court over Bifurcation Act.

ITEMVIDEOS:నల్లారివారి కిరికిరి మళ్లీ మొదలైంది

Posted: 01/16/2017 05:08 PM IST
Kiran kumar petition on andhra pradesh reorganisation bill

ఉమ్మడి రాష్ట్ర ఆఖరి సీఎం, ఆపై సమైక్యాంధ్ర పార్టీ, ఘోర పరాభవం, ప్రస్తుతం ఏ పార్టీలో చేరాలో తెలీక వెయిటింగ్ లో ఉన్న నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి మరోసారి వార్తల్లో నిలిచాడు. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ రాష్ట్ర విభ‌జ‌న అంశంపై సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. విభ‌జ‌న‌ స‌హేతుకంగా జ‌ర‌గ‌లేద‌ని పేర్కొంటూ, కిరణ్‌ స‌హా 24 మంది ఏపీ నేతలు సుప్రీంకోర్టులో వేసిన పిటిష‌న్లపై విచారణ జరిపేందుకు సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అధిక శాతం మంది ప్ర‌జ‌లు రాష్ట్ర విభ‌జ‌న‌ను కోరుకోలేద‌ని రఘురామ కృష్ణం రాజు వాదిస్తున్నారు.

ముఖ్యంగా విభ‌జ‌న చ‌ట్టం పాసైన త‌రువాత కూడా తెలంగాణ‌లోని ఏడు మండ‌లాల‌ను ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో క‌లిపార‌ని తెలిపారు. ఆర్డినెన్స్ ద్వారా తెలంగాణ‌లోకి ఏడు మండ‌లాల‌ను ఏపీలో క‌ల‌పం భావ్యం కాద‌ని, ఆ మండ‌లాల ప్ర‌జ‌లు ఇబ్బందులు ప‌డుతున్నార‌ని పిటిష‌న్‌ల త‌ర‌ఫు న్యాయ‌వాది అన్నారు. రాష్ట్ర విభ‌జ‌న‌ స‌మాజ స్ఫూర్తికి భిన్నంగా జ‌రిగిందని, స‌మాజానికి విఘాతం క‌లిగించారని పిటిష‌నర్లు పేర్కొన్నారు.

అనంత‌రం అన్నింటిపై ఒకేసారి విచారణ చేపడుతామని తెలిపిన బెంచ్, రాష్ట్ర విభ‌జ‌నపై అఫిడ‌విట్ దాఖ‌లు చేయాల‌ని కేంద్ర ప్ర‌భుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. అయితే విచారణ సందర్భంగా న్యాయ‌మూర్తి స్పందిస్తూ.. విభ‌జ‌న జ‌రిగి రెండున్న‌రేళ్లు కావ‌స్తుంద‌ని, ఈ ద‌శ‌లో తాము చేయగలమంటూ పేర్కొనటం కొసమెరుపు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Nallari Kiran Kumar Reddy  AP re organisation Bill  Supreme Court  petition  

Other Articles