మజ్లిస్ అధినేత గాంధీని వదల్లేదు | Ambedkar bigger leader than Mahatma Gandhi.

Asaduddin owaisi comments on mahatma gandhi

AIMIM, MP Asaduddin Owaisi, BR Ambedkar, Mahatma Gandhi, Owaisi Gandhi, Gandhi Ambedkar, Ambedkar bigger than Gandhi, All India Majlis-E-Ittehadul Muslimeen Party, Majlis Party head, Owaisi UP election Campaign,

AIMIM chief Asaduddin Owaisi says BR Ambedkar ‘bigger leader’ than Mahatma Gandhi. it was because of the secular and class-free Constitution given by the Dalit icon which has ensured justice in society.

గాంధీ-అంబేద్కర్ ఎవరు బెటరంటే...

Posted: 01/17/2017 07:57 AM IST
Asaduddin owaisi comments on mahatma gandhi

మజ్లిస్ పార్టీ అధినేత అసదుద్దీన్ ఒవైసీ మరోసారి తన వాగ్ధాటిని ప్రదర్శించాడు. యూపీ అసెంబ్లీ ఎన్నికల నేప‌థ్యంలో ఆ రాష్ట్రంలో ప్రచారం నిర్వహిస్తున్న ఒవైసీ జాతిపిత గాంధీపైనే కామెంట్లు చేశాడు. సంభాల్‌లో నిర్వ‌హించిన‌ బహిరంగ సభలో మాట్లాడుతూ... మహాత్మాగాంధీ కన్నా రాజ్యాంగ నిర్మాత‌ డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కరే గొప్ప నేత అంటూ వ్యాఖ్యానించాడు.

అంబేద్కర్ వల్లే సమాజంలో అన్ని వర్గాలకు న్యాయం చేకూరిందని అన్నారు. అంబేద్క‌ర్ ఒక‌వేళ‌ లౌకికవాద, వర్గ రహిత రాజ్యాంగం రూపొందించి ఉండకపోతే ప‌రిస్థితులు భిన్నంగా ఉండేవ‌ని, సమాజంలో అన్యాయాలు మరింత పెరిగిపోయేవ‌ని అన్నాడు. అంతేగాక, స‌మాజంలోని పరిస్థితులను ఆర్ఎస్ఎస్ మరింత దారుణంగా మార్చేదని ఆయ‌న వ్యాఖ్యానించాడు.

అంతేకాదు పనిలో పనిగా మోదీ ప్రభుత్వంపై కూడా ఒవైసీ విరుచుకుపడ్డాడు. విదేశీ పాలసీని ప్రవేశపెట్టడం ద్వారా దేశానికి ద్రోహం చేశాడని, సర్జికల్ స్ట్రైక్స్ మెచ్చుకోదగిందే అయినప్పటికీ, ఆ తర్వాత 28 మంది జవాన్లు చనిపోవటంపై రక్షణ చర్యలు ఎంత బలహీనంగా ఉన్నాయో చెబుతున్నాయని తెలిపాడు. నోట్ల రద్దు వల్ల పేద వాళ్లు తీవ్ర అవస్థలు పడ్డారంటూ చెప్పుకొచ్చాడు. సమాజ్ వాదీ అంతర్యుద్ధం గురించి ప్రస్తావిస్తూ తండ్రి-కొడుకుల మధ్యే సయోధ్య లేనప్పుడు వాళ్లింకా రాష్ట్రానికి ఏం ఒరగబెడతారంటూ సెటైర్ వేశాడు.

కాగా, మొత్తం 403 అసెంబ్లీ స్థానాలున్న యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఎంఐఎం కూడా పోటీ చేయబోతున్న విషయం తెలిసిందే. ఫిబ్రవరి 11 నుంచి మార్చి 8 దాకా ఏడు దశల్లో ఈ ఎన్నికలు జరగనున్నాయి. ఫలితాలు మార్చి 11న వెల్లడవుతాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : MP Asaduddin Owaisi  Political campaign  UP elections  Gandhi  Ambedkar  

Other Articles