లొల్లి మళ్లీ ముదిరింది: కొడుకుపై మళ్లీ ఎక్కేసిన ములాయం.. | SP chief Mulayam says Akhilesh has gone against him.

Mulayam singh yadav slams son akhilesh again

SP chief Mulayam Singh Yadav, Akilesh Yadav, BJP, Congress, Mulayam Singh Yadav slams son, Akilesh Father Mulayam, Mulayam Akilesh Amar Singh, Samajwadi Party feud

Akilesh Yadav's Father Mulayam Singh slams him again. Overlooking Muslims, Look At Candidates. Alleges Akilesh shake hands with BJP. will take on son in polls.

అమర త్యాగం వృథా అయినట్లేనా?

Posted: 01/16/2017 04:07 PM IST
Mulayam singh yadav slams son akhilesh again

తన వల్లే సమాజ్ వాదీలో చిచ్చు, పైగా తండ్రి-కొడుకులు(ములాయం-అఖిలేష్) దూరం అవుతున్నారన్న భావనలో ఉన్న అమర్ సింగ్ కొద్దికాలంగా వాళ్లకి దూరంగా వెళ్లాలని డిసైడ్ అయిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే యూపీ ఎన్నికలు ముగిసేదాకా లండన్ చెక్కేసేందుకు ఫ్లాన్ కూడా వేసుకున్నాడు. అయితే అమర్ నిర్ణయం ప్రకటించిన కొన్ని గంటలకే, ములాయం సింగ్ యాదవ్ సంచలన ఆరోపణలను చేశాడు. అవసరమైతే తానే స్వయంగా అఖిలేష్ పై పోటీకి దిగుతానని నేతాజీ ప్రకటించాడు కూడా.

సమాజ్‌వాదీ పార్టీ ఎన్నికల గుర్తు అయిన సైకిల్ ములాయం, అఖిలేష్ వ‌ర్గాల్లో ఎవరికి చెందాలనే విషయం గురించి ఎన్నికల కమిషన్ తన నిర్ణయాన్ని ఈ రోజు వెలువరించే అవకాశం ఉంది. ఈ నేప‌థ్యంలో పార్టీ నేతలు, కార్యకర్తలతో భేటీ అయిన ములాయం ఈ వ్యాఖ్యలు చేశాడు. త‌న కుమారుడు రాష్ట్రంలోని ముస్లింల‌ను రెచ్చగొడుతున్నాడ‌ని ములాయం వ్యాఖ్యానించారు. తాను స‌మాజ్‌వాదీ పార్టీని, త‌మ పార్టీ గుర్తును కాపాడుకోడానికి ఎన్నో ప్ర‌య‌త్నాలు చేస్తున్నానని అయితే అఖిలేష్ తన మాటలను లెక్క‌చేయ‌క‌పోతే, తాను ప్రత్యక్షంగా అతడిపై పోటీకి దిగుతానని ఆయ‌న చెప్పారు.

అఖిలేష్‌తో చ‌ర్చించ‌డానికి తాను ఆయ‌న‌ను ఇప్ప‌టికి మూడుసార్లు పిలిచానని, కానీ అఖిలేష్‌ ఒక్క నిమిషం పాటు మాత్రమే ఉండి తాను చెప్పేది విన‌కుండానే వెళ్లిపోయాడ‌ని ఆయ‌న చెప్పారు. తన బాబాయ్ రాంగోపాల్ చెప్పినట్లు నడుచుకుంటున్నాడని తెలిపాడు. అంతేకాదు త‌న కుమారుడు అఖిలేష్ బీజేపీతో పాటు ప‌లు ప్రతిపక్షాలతో చేతులు కలిపాడని ఆయ‌న ఆరోపించారు. అఖిలేష్‌కి తాను నచ్చజెప్పడానికి ప్రయత్నించాన‌ని అయిన‌ప్ప‌టికీ ఆయ‌న‌ చేస్తోన్న‌ తప్పులను తెలుసుకోవడం లేదని ములాయం సింగ్ అన్నారు.

త‌మ పార్టీ గుర్తు విషయంలో ఎన్నికల కమిషన్ తీసుకునే నిర్ణయం ఏ విధంగా ఉన్నా దాన్ని ఆమోదిస్తామని తెలిపాడు కూడా. అవసరమైతే కోర్టుకు వెళ్లేందుకు కూడా సిద్ధమని ప్రకటించాడు. రోజురోజుకీ ముదురుతున్న వివాదం, కుటుంబ‌ క‌ల‌హాలు, రోజుకో మాట మారుస్తూ జనాల్లో కన్ఫ్యూజన్ క్రియేట్ చేయటం ద్వారా, వచ్చే ఎన్నికల్లో ఎస్పీ భారీగా దెబ్బతినే అవకాశం లేకపోలేదని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. యూపీలో ఫిబ్రవరి 11 నుంచి మార్చి 4 వరకు ఏడు విడతల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Amar Sigh  Mulayam Singh Yadav  Akilesh Yadav  Congress  BJP  

Other Articles

Today on Telugu Wishesh