ప్రపంచ టాప్ యూనివర్సిటీలో పవన్ స్పీచ్.. ఏం చెబుతాడు? | Harvard university invite Pawan for Indian conference 2017.

Harvard university invitation to pawan kalyan for indian conference

Pawan Kalyan, Harvard Business School, Janasena chief Pawan Kalyan, Pawan Harvard University, Indian conference-2017, Trivikram Pawan Kalyan, honour to Pawan Kalyan

Tollywood Hero, Janasena chief Pawan Kalyan attend to Harvard university Indian conference-2017. Pawan Kalyan will be speaking at India Conference 2017 at Harvard Kennedy School & Harvard Business School, Boston. Pawan Kalyan has got an invite to speak at the conference which will happen on February 11th and 12th.

హర్వర్డ్ యూనివర్సిటీలో పవన్ స్పీచ్!

Posted: 01/16/2017 03:04 PM IST
Harvard university invitation to pawan kalyan for indian conference

టాలీవుడ్ అగ్రనటుడు, జన సేన అధినేత పవన్ కళ్యాణ్ కు అరుదైన గౌరవం దక్కింది. ప్రఖ్యాత హర్వర్డ్ విశ్వవిద్యాలయంలో ప్రసంగించే అవకాశం ఆయనకు దక్కింది. బోస్టన్ లోని 2017 సంవత్సరానికి గానూ హర్వర్డ్ కెన్నెడీ స్కూల్ అండ్ హర్వర్డ్ బిజినెస్ స్కూల్ లో జరగబోయే ఇండియన్ కాన్ఫరెన్స్ లో పవన్ ప్రసంగించబోతున్నాడు.

తన అభిప్రాయాలను పంచుకునేందుకు హార్వర్డ్ విశ్వవిద్యాలయం నుంచి ఆహ్వానం అందిందట. ఫిబ్రవరి 11, 12 తేదీల్లో ఈ కార్యక్రమం జరగనుంది. దీనికి ప్రముఖ దర్శకుడు, పవన్ సన్నిహితుడు త్రివిక్రమ్ కూడా హాజరు కానున్నారని తెలుస్తోంది. ప్రస్తుతం కాటమరాయుడు షూటింగ్ లో బిజీగా ఉన్న పవన్ ఖచ్ఛితంగా వీలు చేసుకుని కార్యక్రమానికి హాజరవుతానని వాళ్లతో చెప్పాడంట కూడా. అయితే అక్కడ ఏం మాట్లాడబోతున్నాడు అన్నదానిపై మాత్రం ఇంకా క్లారిటీ రాలేదు.

ఇక తమ అభిమాన హీరోకు లభించిన ఈ అరుదైన అవకాశంతో పవర్ స్టార్ అభిమానులు సోషల్ మీడియాలో పవన్ అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. మరోవైపు రాజకీయాల పరంగా చూసుకుంటే ఫిబ్రవరిలోనే ఒంగోలులో జనసేన తర్వాతి మీటింగ్ జరిగే అవకాశం ఉందని సమాచారం.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Pawan Kalyan  Janasena  Harvard Business School  Indian conference-2017  speeech  

Other Articles

Today on Telugu Wishesh