పొగ మంచుతో ఊరిపై కూలిన విమానం.. 32 మంది మృతి | Turkish airlines cargo jet crashes near Kyrgyzstan's Manas airport.

At least 32 killed in turkish plane crash in kyrgyzstan

Turkish Airlines, cargo plane crash, Kyrgyzstan plane mishap, Manas airport, Plane Crash In Kyrgyzstan, Kyrgyzstan Plane Crash, 32 killed Plane Crash

32 people dead after Turkish Airlines cargo plane crashes in Kyrgyzstan's residential area.

ఇళ్లపై కూలిన విమానం.. 32 మంది మృతి

Posted: 01/16/2017 10:47 AM IST
At least 32 killed in turkish plane crash in kyrgyzstan

కిర్జిస్థాన్ లో ఘోర విమాన ప్రమాదం సంభవించింది. టర్కిష్ ఎయిర్ లైన్స్ కు చెందిన రవాణా(కార్గో) విమానం ఒకటి ఇళ్ల సముదాయంపై కూలిపోవటంతో 32 మంది దుర్మరణం పాలయ్యారు. ఈ ఘటన కిర్జిస్థాన్ లోని మనాస్‌ విమానాశ్రయం సమీపంలో డచ్చా సూ అనే గ్రామంలో జరిగింది. విమానం జనావాసాలపై కూలడంతో మంటలు చెలరేగి మృతుల సంఖ్య పెరిగిందని, ఒక పైలట్ సహా 16 మంది మృతదేహాలను వెలికితీశామని ప్రభుత్వం వెల్లడించింది.

మృతుల్లో అత్యధికులు స్థానిక ప్రజలేనని, ఈ సంఖ్య మరింతగా పెరిగే అవకాశాలు ఉన్నాయని పేర్కొన్నారు. కాగా, బోయింగ్ 747 విమానం ఉదయం ఏడు గంటలకు మనాస్ ఎయిర్ పోర్ట్ నుంచి బయలుదేరింది. ఉదయం 7గంటల 31 నిమిషాలకు కూలిపోయింది. పొగమంచు కారణంగానే ప్రమాదం జరిగినట్లు ప్రాథమిక విచారణలో తేలింది.

కాగా, ప్రమాదంలో 15 భవనాలు నేల మట్టం అయినట్లు అధికారులు తెలిపారు. మృతుల్లో ఆరుగురు పిల్లలు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. సింగపూర్ కి సరుకులు తీసుకెళ్లే ఈ బోయింగ్ విమానం ప్రమాదంకి గురికావటం పట్ల పలువురు దేశాధినేతలు విచారం వ్యక్తం చేస్తున్నారు. మరో వైపు ఈ ప్రమాదం కారణంగా పలు విమాన రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Turkish Airlines  Plane Crash  32 killed  Manas airport  Kyrgyzstan  

Other Articles