రజినీ అభిమానులతో ఆ హీరో పెట్టుకున్నాడు... వదిలేస్తారా? | Sharathkumar Oppose If Rajinikanth Enters Politics.

Actor sharath kumar criticises rajinikanth unusual political climate remark

R Sarathkumar, Rajinikanth, Sarathkumar Rajinikanth, Rajinikanth Jallikattu comments, Sharath Kumar criticises Rajinikanth, Tamil Nadu Politics, Rajini fans on Sharathkumar, SharathKumar Rajinikanth, Rajinikanth Political entry, Rajinikanth unusual comments

Actor R Sarathkumar, founder-president of All India Samathuva Makkal Katchi which is an ally of the ruling AIADMK, has slammed superstar Rajinikanth for calling the current political climate in Tamil Nadu "unusual'' during a speech at an event.

రజనీ కామెంట్లు... ఆపై తీవ్ర కలకలం

Posted: 01/16/2017 10:18 AM IST
Actor sharath kumar criticises rajinikanth unusual political climate remark

తమిళనాట రాజకీయాల్లో మరోక కలకలం రేగింది. తలైవా, సూపర్ స్టార్ రజనీకాంత్ రాజకీయ ఆరంగ్రేటం పై నటుడు ప్రవేశంపై తమిళనాడులో వివాదం రగిలింది. జల్లికట్టుపై రజనీ కీలక కామెంట్లు చేసిన వేళ ఆయన పాలిటిక్స్ లోకి రావాలంటూ అభిమానులు పిలుపునివ్వటం, రజనీ వస్తే అడ్డుకుని తీరతామని నటుడు, సమతువ మక్కల్ కట్చి పార్టీ అధ్యక్షుడు(అన్నాడీఎంకే భాగస్వామి) శరత్ కుమార్ హెచ్చరించడం పెను దుమారాన్ని రేపుతోంది.

‘‘పెద్దగా అందం, తెలివి లేకపోయినా తమిళ ప్రజలు నన్ను ఆదరించారు. జయలలిత మరణానంతరం తమిళనాడులో అసాధారణ పరిస్థితి నెలకొంది. ముఖ్యంగా జల్లికట్టు తమిళుల సంస్కృతి. ఎవరైనా సంస్కృతి విషయంలో కలుగజేసుకోకూడదు. ఎలాంటి నిబంధనలైనా విధించండి. అయితే జల్లికట్టుపై నిషేధం వద్దు' అని రజినీ వ్యాఖ్యానించారు. పెద్దవారు మనకంటూ సంప్రదాయాన్ని ఏర్పరచారని.. దాన్ని కాపాడుకోవలసిన బాధ్యత మనపై ఉందని చెప్పారు. కాబట్టి జల్లికట్టు కచ్చితంగా జరగాల్సిందేనని స్పష్టం చేశారు.

దీంతో రాష్ట్ర పరిస్థితులను పేర్కొంటూ రజినీ చేసిన ఈ వ్యాఖ్యలతో రాజకీయ పార్టీల నేతలు, విశ్లేషకులు రాజకీయ ప్రవేశంపై రజినీ ఆసక్తి చూపిస్తున్నారా? అంటూ తమ విశ్లేషణలను కొనసాగించారు. ఈ నేపథ్యంలో వెంటనే తెర మీదకు వచ్చిన శరత్ కుమార్ రజనీకి తాను ఎదురు వెళ్తానంటూ కామెంట్లు చేశాడు. శనివారం తుగ్లక్ పత్రిక కార్యక్రమంలో పాల్గొన్న ఆయన... అసాధారణ పరిస్థితి అంటూ రజనీ మాట్లాడం అవగాహనా రాహిత్యానికి నిదర్శనమంటూ మండిపడ్డాడు. 

"రజనీకి తమిళనాడు ప్రజల కష్టాలు, కన్నీళ్ల గురించి తెలియవు. సూపర్ స్టార్ గా, నటుడిగా నాకు రజనీకాంత్ పై గౌరవం ఉంది. అయితే, రాజకీయాల్లోకి వస్తానంటే మాత్రం కుదరదు. ఎందరో మహా నేతలు తమిళనాడు గడ్డపై జన్మించారు. వారం రోజులు తమిళనాడులో, మరో వారం కర్ణాటకలో ఉండే రజనీకాంత్ కు సీఎం అయ్యే అర్హత లేదు" అని శరత్ కుమార్ నిప్పులు చెరిగారు. తమిళ సంప్రదాయాలపై ఆయనకు అవగాహన లేదని, ఈ విషయం ఎంతో మందికి తెలుసునని అన్నాడు. దీంతో రజనీకాంత్ అభిమాన సంఘాలు రాష్ట్రవ్యాప్తంగా నిరసన ప్రదర్శనలకు దిగాయి. శరత్ కుమార్ దిష్టి బొమ్మలను దగ్ధం చేస్తూ, రోడ్లపై ధర్నాలు జరుగుతున్నాయి. రజనీకాంత్ అభిమానులను అడ్డుకునేందుకు పోలీసులు రంగంలోకి దిగారు. కాగా, ఈ విషయంలో ఇప్పటిదాకా రజనీ మౌనంగానే ఉన్నాడు.

Sharath Kumar Rajini Fans

అయితే తీవ్ర నిరసనలు పెల్లుబిక్కటం మూలంగానే ఏమో శరత్ కుమార్ వెంటనే మాట మార్చేశాడు. రజనీకాంత్ గురించి తనంతట తాను మాట్లాడలేదని తెలిపాడు. త‌న‌వద్ద‌కు వ‌చ్చిన‌ విలేక‌రులు తనను ఆ విషయంపై ప్రశ్నించడంతోనే స్పందించానని పేర్కొన్నారు. రజనీకాంత్ తనకు స్నేహితుడేన‌ని చెప్పిన‌ ఆయన.. ఒక‌వేళ ర‌జనీ పార్టీ పెడితే మాత్రం ఆయ‌న‌ను ప్రత్యర్థిగా భావిస్తానని అన్నారు. తమిళనాడు రాష్ట్రాన్ని పాలించే వారు జన్మతః తమిళులే అవ్వాలన్నది త‌న ఉద్దేశ‌మ‌ని తెలిపారు.

 

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Sharathkumar  Rajinikanth  Jallikattu  Political Entry  

Other Articles