తీరు మారని అమెజాన్.. బ్యాన్ చేయాలంటూ విజ్నప్తులు | Now Amazon lists slippers with Mahatma Gandhi image.

Gandhi flip flops sold on amazon cause anger in india

Amazon India, Gandhi flip-flops, Amazon Gandhi Slippers, Indian Flag, Tricolor doormats, Gandhi Jandals, Amazon Controversy, Amazon US India, Amazon on Indian Symbols, Mahatma Gandhi Amazon, Indian Door Mats, India Amazon, Amazon Ban India

After Tricolour doormats, Amazon US now offers 'Gandhi flip-flops'.

అమెజాన్ కు మళ్లీ సీరియస్ వార్నింగ్!

Posted: 01/16/2017 08:24 AM IST
Gandhi flip flops sold on amazon cause anger in india

భారత జాతీయ పతాకాన్ని పోలిన కాలి పట్టాలను విక్రయిస్తూ భారత దేశ సౌర్వభౌమత్వాన్ని, గౌరవాన్ని కించపరిచిన ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ ను కేంద్ర సర్కారు మరోసారి హెచ్చరించింది. ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి శక్తికాంతదాస్ దీనిపై స్పందిస్తూ... అమెజాన్ భారతదేశ చిహ్నాలు, గౌరవ సూచికలతో అలక్ష్యంగా వ్యవహరించరాదన్నారు. భారతీయుల మనోభావాల విషయంలో వివక్ష చూపితే అమెజాన్ తనంతట తానే ప్రమాదం కొనితెచ్చుకున్నట్టు అవుతుందన్నారు. అయితే, ఈ వ్యాఖ్యలను తాను ఓ భారతీయ పౌరుడిగానే చేస్తున్నానని ఆయన అన్నారు. ఓ పౌరుడిగా తాను అమెజాన్ తీరు పట్ల ఎంతో కలత చెందానన్నారు.

తాజాగా జాతిపిత గాంధీ బొమ్మ‌తో ఉన్న చెప్పులు సైట్‌లో అమ్మ‌కానికి పెట్టింది. ఇది గ‌మ‌నించిన కొంద‌రు ట్విట్ట‌ర్ యూజ‌ర్లు దీనిని బాగా హైలైట్ చేశారు. ప్ర‌ధాని మోదీ, సుష్మాస్వ‌రాజ్‌ల‌ను ట్యాగ్ చేసి ఈ ఫొటోల‌ను పోస్ట్ చేశారు. గాంధీ ఫ్లిప్ ఫ్లాప్స్ ధ‌ర 16.99 డాల‌ర్లంటూ అమెజాన్ ఆ స్లిప్ల‌ర్స్‌ను అమ్మ‌కానికి పెట్టింది. దీంతో విషయం వెలుగులోకి వచ్చింది.  అమెజాన్ బహిష్కరణ?

Amazon Insult Gandhi

ఇప్పటికే కేంద్ర మంత్రి సుష్మాస్వరాజ్ అమేజాన్ సంస్థకు గట్టి హెచ్చరికలే చేసిన విషయం తెలిసిందే. కెనడాలో అమేజాన్ రిటైల్ విక్రయ విభాగం భారత పతాకాన్ని పోలిన కాలి పట్టాలను కొన్ని రోజుల క్రితం విక్రయానికి పెట్టగా... ఈ విషయాన్ని తెలుసుకున్న సుష్మాస్వరాజ్ తక్షణమే వాటి విక్రయాలను నిలిపివేసి భారత్ కు క్షమాపణ చెప్పాలని వార్నింగ్ ఇచ్చారు. మరోసారి ఇలా చేస్తే అమెజాన్ ప్రతినిధులకు వీసాలు కూడా ఇవ్వమని తేల్చిచెప్పారామె. దాంతో అమెజాన్ ఇండియా ప్రతినిధి క్షమాపణలు తెలిపారు. 

అయితే విమర్శలపై అమెజాన్ స్పందించ‌క‌పోయినా.. సోష‌ల్ మీడియాలో ఇది బ‌య‌ట‌ప‌డిన త‌ర్వాత ఆ స్లిప్ప‌ర్స్‌ను సైట్ నుంచి తొల‌గించింది. దీనిపై ట్విట్ట‌ర్ యూజ‌ర్లు తీవ్రంగా స్పందించారు. అమెజాన్‌ను దేశం నుంచి బ‌హిష్క‌రించాల‌ని డిమాండ్ చేశారు. డోర్‌మ్యాట్ల విష‌యంలోనే అమెజాన్ ప్ర‌తినిధుల‌కు ఇండియ‌న్ వీసాలు నిలిపేస్తామ‌ని సుష్మా తీవ్రంగా హెచ్చ‌రించారు. దీంతో ఆ సంస్థ దిగి వ‌చ్చింది. కానీ ప‌దేప‌దే ఇలా భార‌తీయుల సెంటిమెంట్ల‌ను గౌర‌వించ‌కుండా అమెజాన్ వ్య‌వ‌హ‌రిస్తున్న తీరు ఆందోళ‌న క‌లిగిస్తోందని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. మనదేశంలో అమెజాన్ రెండో అతిపెద్ద ఈ-కామర్స్ సంస్థగా ఉన్న విషయం తెలిసిందే.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : India  Amazon  Flag  Door Mats  Gandhi Slippers  Controversy  

Other Articles