భారత్ లో ఈ కామర్స్ సంస్థ అమెజాన్ ను రద్దు చేస్తారా..? Amazon's Mahatma Gandhi flip-flops prompt anger

Amazon s mahatma gandhi flip flops prompt anger

Gandhi flip flops, Amazon flip flops, Sushma Swaraj, Mahatma Gandhi, Amazon US, Mohandas Karamchand Gandhi‬, Narendra Modi‬‬, Amazon.com

Flip-flops bearing the face of India's independence icon Mahatma Gandhi for sale on Amazon triggered fresh outrage, days after the e-retail giant was forced to stop selling Indian flag doormats.

భారత్ లో ఈ కామర్స్ సంస్థ అమెజాన్ ను రద్దు చేస్తారా..?

Posted: 01/15/2017 12:29 PM IST
Amazon s mahatma gandhi flip flops prompt anger

భారతీయులను అవమానించేలా వ్యవహరిస్తున్న అమెజాన్ సంస్థ లావాదేవీలను కేంద్ర ప్రభుత్వం రద్దు చేయాలన్న డిమాండ్ నెట్ జనుల నుంచి వెల్లువెత్తుతుంది. భారతీయ మార్కెట్ల నుంచి లక్షలాధి కోట్ల రూపాయలను సోమ్ము చేసకుంటున్న ఈ సంస్థ.. భారత జాతీయ నేతలు, జాతీయ పతాకాలను అవమానించే రీతిలో వ్యవహరిస్తుంది. భారత జాతీయ జెండా తరహా డోర్‌మ్యాట్‌లను తన కెనడా వెబ్‌సైట్‌లో అమ్మకాలకు ఉంచి తీవ్ర విమర్శల పాలైన అమెజాన్‌ సంస్థపై స్వయంగా విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్‌ ఆగ్రహం వ్యక్తం చేయడంతో దిగొచ్చిన అమెజాన్‌.. భారతీయుల మనోభావాలు దెబ్బతినే అలాంటి తప్పునే మరోసారి చేసింది.

అమెజాన్‌ యూఎస్‌ వెబ్‌సైట్‌లో గాంధీజీ బొమ్మ ముద్రించి ఉన్న చెప్పులను అమ్మకానికి ఉంచింది. దీనిని గుర్తించిన ఓ ట్విట్టర్‌ యూజర్‌.. ఈ విషయాన్ని ప్రధానమంత్రి నరేంద్రమోదీకి ట్యాగ్‌ చేశారు. డోర్‌ మ్యాట్‌ల వ్యవహారంలో ఇది తమ తప్పిదం కాదని.. వెబ్‌సైట్‌లో వాటిని థర్డ్ పార్టీ అమ్మకానికి ఉంచిందని అమెజాన్‌ చెప్పుకుంది. భారతీయుల మనోభావాలు దెబ్బతినే ఇలాంటి ఉత్పత్తులను తమ వెబ్‌సైట్‌ ద్వారా అమ్మకానికి ఉంచకుండా చర్యలు చేపట్టాలని అమెరికాలోని భారత రాయబారికి ప్రభుత్వం ఆదేశించిందని ఏఎన్‌ఐ వార్తా సంస్థ వెల్లడించింది. ఇదిలా వుండగా, అమెజాన్ సంస్థను భారత్ లో నిషేధించాలన్న డిమాండ్ కూడా పెరుగుతుంది. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఆ మేరకు చర్యలు తీసుకుంటుందా..? అన్న ప్రశ్నలు కూడా ఉత్పన్నమవుతున్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles

Today on Telugu Wishesh