బీహార్ తరువాత ఉత్తర్ ప్రదేశ్ లోనూ పడవ ప్రమాదం Inquiry Begins After 24 Drown In Ganga Near Patna

Bihar boat accident inquiry begins after 24 drown in ganga near patna

Patna Boat Capsized, Patna boat tragedy, death toll Patna boat accident, Patna boat accident, Disney Mela, Bihar Government, Ganges accident, Ganges, Patna, Bihar Boat Accident, Ganga

Five more bodies were recovered from Ganga this morning, raising the number of deceased in Patna boat tragedy to 24. The boat, carrying around 40 people, capsized

బీహార్ తరువాత ఉత్తర్ ప్రదేశ్ లోనూ పడవ ప్రమాదం

Posted: 01/15/2017 03:13 PM IST
Bihar boat accident inquiry begins after 24 drown in ganga near patna

బిహార్‌ రాజధాని పట్నాలో గంగానదిలో పడవ మునిగి 24 మంది చనిపోయిన కొద్ది గంటలకే పొరుగు రాష్ట్రం ఉత్తరప్రదేశ్‌లో ఇలాంటిదే మరో సంఘటన జరిగింది. హమీపూర్‌ జిల్లా కేంద్రంలోని విర్మా నదిలో పడవ మునిగి ముగ్గురు మృతిచెందారు. మరో ముగ్గురు గల్లంతయ్యారు. మృతుల్లో ఇద్దరు చిన్న పిల్లలుకాగా, ఒకరు మహిళ. ప్రమాదం గురించిన సమాచారం అందిన వెంటనే అధికారులు ఘటనా స్థలికి చేరకుని సహాయక చర్యలు చేపట్టారు.

24కు చేరిన బిహార్ మృతుల సంఖ్య

బిహార్ రాజధాని పట్నాలో గంగానదిలో పడవ బోల్తా పడిన దుర్ఘటనలో మృతుల సంఖ్య 24కి చేరింది. మరోవైపు గల్లంతు అయినవారి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఎన్డీఆర్ఎఫ్‌ బృందాలు గాలింపు జరుపుతున్నాయి. ఇప్పటివరకూ 21 మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. కాగా ప్రమాదం జరిగినప్పుడు పడవలో 40మంది ప్రయాణికులు ఉన్నారు. పడవలో పరిమితికి మిచ్చి  ప్రయాణికులు ఎక్కడం వల్లే ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. వీరంతా  కైట్‌ ఫెస్టివల్‌కు వెళ్లి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది.

వీరంతా  కైట్‌ ఫెస్టివల్‌కు వెళ్లి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. బిహార్ ప్రభుత్వం మృతుల కుటుంబాలకు రూ.4లక్షలు,  పీఎంఎన్‌ఆర్‌ఎఫ్‌ కింద మృతుల కుటుంబాలకు రూ.2 లక్షలు, గాయపడినవారికి రూ.వేలు కేంద్రం ఎక్స్గ్రేషియా ప్రకటించింది. ప్రమాద ఘటనపై ముఖ్యమంత్రి విచారణకు ఆదేశించారు. పడవ బోల్తా ప్రమాదంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. అలాగే కాంగ్రెస్‌ అధినేత్రి సోనియా గాంధీ కూడా సంతాపం తెలిపారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Bihar  Boat Tragedy  Boat capsizes  Patna  Ganga River  uttar pradesh  

Other Articles

Today on Telugu Wishesh