చేతిలో చెరఖా.. మనస్సులో గాడ్సే.. మోడీపై గాంధీ మనవడు Tushar Gandhi attacks PM Modi over Khadi calendar imbroglio

Tushar gandhi attacks pm modi over khadi calendar imbroglio

mahatma gandhi, tushar gandhi, modi-diary-calendar controversy, modi-khadi calendar controversy, modi-gandhi, modi-mahatma gandhi, modi suit, modi golden suit, modi dresses

Gandhi was referring to his iconic great-grandfather's historic visit to Britain in 1931, when he met Britain's King George V and Queen Mary, clad in his trademark plain loincloth and a shawl.

చేతిలో చెరక.. మనస్సులో గాడ్సే.. మోడీపై గాంధీ మనవడు ఫైర్

Posted: 01/15/2017 11:23 AM IST
Tushar gandhi attacks pm modi over khadi calendar imbroglio

ఖాదీ విలేజ్ ఇండస్ట్రీస్ కమిషన్ విడుదల చేసిన క్యాలెండర్, డైరీలపై మ‌హాత్మా గాంధీ బొమ్మ వేయ‌కుండా నరేంద్ర‌ మోదీ చిత్రాలను ప్రచురించడం ప‌ట్ల ప‌లువురి నుంచి విమ‌ర్శ‌లు వ‌స్తోన్న తరుణంలో గాంధీ మునిమనవడు తుషార్ గాంధీ కూడా తీవ్రంగా మండిపడ్డారు. ''చేతిలో చరఖా, మనసులో గాడ్సేను పట్టుకున్న వాళ్లు ఖాదీకి క్యాలెండర్ పై ఫోటోలకు ఫోజులివ్వడం దారుణమన్నారు. నిత్యం టీవీలలో కనిపించాలన్న ఉడలాటం తప్ప మరోటి లేదని విమర్శించారు.

‘‘టీవీలలో కనిపించే జోకర్‌ని జోకర్ అని పిలవడంలో తప్పులేదు'' అంటూ, కేవీఐసీని మూసేయాలని డిమాండ్ చేశారు. బాపూజీ బకింగ్‌హామ్ ప్యాలెస్‌కు వెళ్లేటప్పుడు కూడా ఖద్దరు ధరించే వెళ్లారు తప్ప 10 లక్షల రూపాయల సూట్ వేసుకెళ్లలేదని మోదీని విమర్శించారు.  1931 సంవత్సరంలో బాపూజీ బ్రిటన్ వెళ్లినపపుడు ఐదో జార్జి రాజును, మేరీని కలిసినప్పుడు కూడా ఆయన తన ట్రేడ్‌మార్కు ధోవతి, శాలువా మాత్రమే ధరించి వెళ్లిన విషయాన్ని తుషార్ గాంధీ ప్రస్తావించారు.
 
అయితే.. అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా 2015 జనవరిలో భారతదేశానికి వచ్చినప్పుడు ప్రధాని మోదీ రూ. 10 లక్షల విలువైన సూట్ ధరించడంతో పెద్ద వివాదం చెలరేగింది. తొలుత 2వేల రూపాయల నోటు మీద బాపూజీ అదృశ్యం అయ్యారని, ఇప్పుడు కేవీఐసీ క్యాలెండర్ నుంచి కూడా మాయమయ్యారని అన్నారు. అవినీతిపరులైన రాజకీయ నాయకుల చేతుల్లో నలిగే నోట్ల మీద ఉంచేకంటే.. అసలు బాపూజీ ఫొటోను పూర్తిగా కరెన్సీ నోట్ల నుంచి తీసేయడమే నయమని కూడా ఆయన మండిపడ్డారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Narendra Modi  Tushar Gandhi  calender row  golden suit  calender controversy  

Other Articles