రూటు మార్చుకున్న లగడపాటి.. కేసీఆర్ పై కామెంట్స్.. lagadapati rajagopal interesting comments on kcr

Lagadapati rajagopal interesting comments on kcr

lagadapati rajagopal, former parliamentarian, telangana CM, KCR, yadadri tour, ladagapati comments on kcr, political news

Former parliamentarian lagadapati rajagopal visits yadadri, comments on Telangana chief minister kcr, saying he will be in the history forever for making yadadri a worldwide pilgrim.

రూటు మార్చుకున్న లగడపాటి.. కేసీఆర్ పై కామెంట్స్..

Posted: 01/14/2017 02:59 PM IST
Lagadapati rajagopal interesting comments on kcr

తెలంగాణ ఉద్యమం ఉదృతంగా సాగుతున్న రోజుల్లో కేసీఆర్ నిరహారా దీక్షకు పోటీగా దీక్షను చేపట్టడంతో పాటు.. కేసీఆర్ సహా తెలంగాణ ఉద్యమంపై తీవ్ర విమర్శలు చేసిన లగడపాటి రాజగోపాల్.. తన రూటు మార్చుకున్నారు. తెలంగాణ రాష్ట్ర అవిర్భావంతో రాజకీయాలకు దూరంగా ఉన్న మాజీ ఎంపీ లగడపాటి.. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై ఆసక్తికరమైన కామెంట్స్ చేశారు. యాదాద్రి ఆలయాన్ని ప్రపంచస్థాయి పుణ్యక్షేత్రంగా మార్చడానికి ముఖ్యమంత్రి చేస్తున్న కృషి హర్షనీయమని, ఈ ఆలయ ప్రాశస్త్యాన్ని విశ్వవ్యాప్తం చేయాలని పట్టుదలతో ఉన్న సీఎం కేసీఆర్ చరిత్రలో నిలిచిపోతారని ఆయన పొగడ్తల వర్షం కురిపించారు.
 
యాదాద్రి అభివృద్ధి పనులు దిగ్విజయంగా కొనసాగాలని కోరుకుంటున్నాని, ఇంతకుముందు యాదాద్రి రూపురేఖలు మారబోతున్నాయని మీడియాలో మాత్రమే చూశానని, ఇప్పుడు ప్రత్యక్షంగా తిలకించానని రాజగోపాల్ అన్నారు. ఇంతకుముందు యాదాద్రిని సందర్శించుకున్న తర్వాతే తాను ఎంపీగా గెలిచానని కూడా లగడపాటి చెప్పారు. అయితే.. ఇప్పుడు రాజకీయాల్లోకి మళ్లీ రావడంపై మాత్రం ఆయన స్పందించలేదు. మొత్తమ్మీద చాలాకాలం తర్వాత ఆయన వార్తల్లోకి రావడం విశేషం. యాదాద్రి పర్యటనలో మాజీ ఎంపీ లగడపాటితో పాటు మల్కాజిగిరి ఎంపీ మల్లారెడ్డి తదితరులు కూడా పాల్గొన్నట్లు తెలిసింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles