తెలుగు ప్రజలకు పవన్ కల్యాన్ శుభాకాంక్షలు Pawan Kalyan’s wishes AP people on sankranti festival

Pawan kalyan s wishes ap people on sankranti festival

pawan kalyan, jana sena, sankranti, andhra pradesh, telangana, fans, party cadre,, uddanam, notes ban, demonetisation, Telugu Movies Telugu Gossips, Tollywood New Movies2016, bollywood 2016, hit songs, tollywood

Actor turned politician, Janasena Party chief, power star Pawan Kalyan sankranti wishes to AndhraPradesh and Telangana people.

తెలుగు ప్రజలకు, పాలకులకు క్రాంతిని తీసుకురావాలి: పవన్ కల్యాన్

Posted: 01/14/2017 09:52 AM IST
Pawan kalyan s wishes ap people on sankranti festival

ఉభయ రాష్ట్రాల తెలుగు ప్రజలకు ప్రముఖ సినీనటుడు, జనసేన పార్టీ అధ్యక్షుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు సుభిక్షింగా ఉండాలని ఆకాంక్షించారు. సంక్రాంతి పండగ ప్రజలతో పాటు పాలకులలో కూడా కాంతిని నింపే పండుగ కావాలని అభిలాంశించారు. ఇదే సమయంలో ఆయన కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా గళాన్ని వినిపించేందుకు కారణమైన ప్రత్యేక హోదా అంశాన్నికూడా ప్రస్తావించారు. ఈ సంక్రాంతి నవ్యాంధ్రకు ప్రత్యేక హోదా తీసుకురావాలని కోరుకున్నారు.

నోట్ల రద్దు వంటి గాయాలు మళ్లీ చేయకుండా రాజకీయ పెద్దల నుంచి కాపాడాలని వపన్ కళ్యాణ్ తన ప్రకటనలో పేర్కొన్నారు. అంతేగాక, ఈ సంక్రాంతి పండగ ఉద్దానం కిడ్నీ బాధితులకు స్వాంతన కలగజేయాలని పేర్కొన్నారు. ఇటీవల పవన్ కళ్యాణ్ ఇచ్ఛాపురంలో ఉద్దానం కిడ్నీ వ్యాధి బాధితులతో ముఖాముఖి నిర్వహించి వారి సమస్యలను తెలుసుకున్న విషయం తెలిసిందే. ఆయన చొరవతో ప్రభుత్వం కూడా ఉద్దానం సమస్యను పరిష్కరించేందుకు ముందుకు వచ్చింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : pawan kalyan  jana sena  sankranti  andhra pradesh  telangana  fans  party cadre  tollywood  

Other Articles

Today on Telugu Wishesh