అమెరికా గన్ కల్చర్: చివరకు చికెన్ పీస్ కోసం తుపాకీ ఎక్కుపెట్టాడు.. Boy, 'pulls gun on girl for her chicken nuggets in McDonald's'

New york boy 12 demands chicken nugget at gunpoint

chicken nugget, subway station, McDonald's, fast food outlet, New York Police Department, family courts, Harlem, new york

A 12-year-old boy is accused of pulling a gun on a girl and demanding one of her chicken nuggets, New York police say.

అమెరికా గన్ కల్చర్: చివరకు చికెన్ పీస్ కోసం తుపాకీ ఎక్కుపెట్టాడు..

Posted: 01/14/2017 10:37 AM IST
New york boy 12 demands chicken nugget at gunpoint

డబ్బుల కోసం, బంగారం కోసం తుపాకీ ఎక్కు పెట్టి బెదిరించిన సంఘటనలు ఇప్పటి వరకు చూసే ఉంటాం... కానీ ఇందుకు భిన్నంగా కేవలం చికెన్‌ ముక్క కోసం ఓ బాలుడు తన క్లాస్‌మెట్‌పైనే తుపాకీ ఎక్కుపెట్టాడు. ఈ ఘటన న్యూయార్క్‌లో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం హర్లేమ్‌లోని మెక్‌ డొనాల్డ్స్‌ రెస్టారెంట్‌లో ఓ పన్నెండేళ్ల  బాలుడు తన క్లాస్‌మెట్‌ అయిన ఓ బాలికను కలిశాడు. ఆ బాలిక తింటున్న చికెన్‌లో తనకు ఓ ముక్కను ఇవ్వాలని అడిగాడు. అందుకు బాలిక తిరస్కరించింది.

ఆ తర్వాత  బయటికి వెళ్లిన బాలిక తలపై తుపాకీ ఎక్కుపెట్టి చికెన్‌ ముక్క ఇవ్వాలని బెదిరించాడు. దీనికి భయపడిన బాలిక... తుపాకీని పక్కకు తోసి తనను వదిలివేయమని ప్రాధేయపడటంతో  విడిచిపెట్టాడు. అయితే మరుసటి రోజు ఈ విషయాన్ని పాఠశాలలోని ఉపాధ్యాయులకు బాలిక చెప్పడంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వెంటనే ఆ అబ్బాయిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కాగా, బాలుడు బెదిరించిన తుపాకీ దొరక్కపో వడంతో.. అది నిజమైనదా.. కాదా అనే విషయం నిర్ధారణ కాలేదు. అయితే ఈ వార్త వెలుగులోకి రావడంతో అమెరికాలోని గన్ కల్చర్ పై మరోమారు దుమారం రేగుతోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles

Today on Telugu Wishesh