వేసవికి ముందే సంబరం.. అందుబాటులోకి గగనయానం.. Hyderabad Joy Ride Fest from today

Helicopter joy ride at necklace road from today

kite festival, joy ride, necklace road, helicopter ride, helicopter trip, aerial view, bird’s eye, Tank Bund, Buddha Statue, Lumbini Park, NTR Gardens, Birla Mandir, IMAX, Sanjeevaiah Park, Snow World

Telangana Tourism Department is conducting a “Helicopter Joy Ride” to make a whirl-wind tour of the twin cities for six days.

వేసవికి ముందే సంబరం.. అందుబాటులోకి గగనయానం..

Posted: 01/13/2017 11:28 AM IST
Helicopter joy ride at necklace road from today

హైదరాబాద్ నగరవాసులకు తెలంగాణ టూరిజం శాఖ సంక్రాంతి సంబరాన్ని అంబరానికి తాకే విధంగా చేసుకునే అవకాశాన్ని కల్పించింది. ఇవాళ్లి నుంచి ఐదు రోజుల పాటు అనగా 17వ తేదీ వరకు గతంలో రద్దు చేసిన హెలీకాప్టర్ ట్రిప్ ను మళ్లీ పునరుద్ధరించింది. సంక్రాంతి పండగ నేపథ్యంలో నెక్లస్ రో్డ్డులోని పీపుల్స్ ప్లాజా వద్ద జరగనున్న పతంగుల పండగలో దేశ, విదేశాల నుంచి పెద్ద సంఖ్యలో గాలిపటాలను ఎగురవేస్తూన్న దృష్టాలను గగనతలం నుంచి వీక్షించే అవకాశాన్ని కల్పించనున్నారు.

ఈ హెలికాప్టర్ ట్రిప్ ద్వారా గగనతలం నుంచి హుస్సేన్‌ సాగర్, నెక్లెస్‌ రోడ్డు, సాగర్‌ మధ్యలో ఉండే తథాగతుడిని వీక్షించి అక్కడికి కాస్త దూరంలో ఉండే బిర్లా మందిర్, శాసనసభా ప్రాంగణం, చార్మినార్, మక్కా మసీదు, గోల్కొండ కోట పరిస రాలు... హైటెక్‌ సిటీ, సైబరాబాద్‌లోని ఐటీ భవనాలన్నింటినీ నిమిషాల్లో వీక్షించాలను కునేవారికి ఇదో అవకాశం. గత ఏడాది మార్చి ఒకటిన నెక్లెస్‌ రోడ్డు, జలవిహార్‌ సమీపంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ప్రాంతం లో హెలీటూరిజం కార్యక్రమాన్ని అధికారులు ప్రారంభించారు.

కొంతకాలం నడిచాక ఉపరాష్ట్ర పతి నగరానికి వచ్చిన నేపథ్యంలో గగనతల ఆంక్షలు విధించి, ఏవియేషన్‌ అధికారులు అనుమతులు నిరాకరించారు. దానికితోడు బుకింగ్‌ పొరపాట్ల కారణంగా పర్యాటకులు ఆసక్తి చూపకపోవటంతో గగన విహారానికి బ్రేక్‌ పడింది. ఈ నేపథ్యంలో అధికారులు ఈసారి కొన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. ముందుగానే ఎయిర్‌ట్రాఫిక్‌ కంట్రోల్, డైరెక్టర్‌ జనరల్‌ సివిల్‌ ఏవియేషన్‌ అనుమతులను పొందారు. టూరిజం కార్యదర్శి బుర్రా వెంకటేశం తుంబే ఏవియేషన్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ వారిని ఒప్పించి హెలీటూరిజం ప్రారంభమయ్యేలా చేశారు.

ఈ హెలీ టూరిజాన్ని ఐదురోజులకే పరి మితం చేశారు. 13 నుంచి 17 వరకు సాగు తుంది. ఉదయం 10 గంటలకు ప్రారంభమై మధ్యాహ్నం 1 గంట వరకు, మధ్యాహ్నం 2 నుంచి 5 గంటల వరకు హెలీకాప్టర్‌ తిరుగు తుంది. ఒక్కొక్కరికి రూ.3,500 టికెట్‌ ధర చెల్లించాలి. నలుగురు కుటుంబసభ్యులు కలసి వస్తే ఒక్కొక్కరికి రూ.3 వేలు, 12 మంది కుటుంబసభ్యులు కలసి వస్తే ఒక్కొక్కరికి రూ. 2,500 చెల్లించాలి. మేరా ఈవెంట్స్‌ డాట్‌ కామ్‌లో బుకింగ్‌ చేసుకోవాలని అధికారులు సూచించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles