గోవా ముఖ్యమంత్రి అభ్యర్థిగా మళ్లీ బరిలోకి ఆయనేనా..? Central leader could return as CM says Nitin Gadkari

Central leader could return as cm says nitin gadkari

bjp, goa polls, goa bjp, goa elections, goa cm, Defence Minister, Manohar Parrikar, Ayush Minister, Shripad Naik, nitin gadkari, india news

Union Minister and BJP’s Goa state in-charge Nitin Gadkari said the party will not announce a CM candidate before the elections, but elected MLAs will either choose someone from among themselves or “someone from the Centre can be sent”.

గోవా ముఖ్యమంత్రి అభ్యర్థిగా మళ్లీ బరిలోకి ఆయనేనా..?

Posted: 01/13/2017 10:42 AM IST
Central leader could return as cm says nitin gadkari

గోవాలో అధికారంలో వున్న బీజేపి పార్టీ మళ్లీ అధికారంలోకి వచ్చేందుకు ఎత్తుగడ వేసింది. ఇప్పటికే మిత్రపక్షాల నుంచి షాక్ ల మీద షాకులు ఎదుర్కోని నివ్వెరపోయిన బీజేపికి అటు కాంగ్రెస్, ఇటు అప్ పార్టీల నుంచి పోటీ తీవ్రంగా వుండటంతో పాటు మిత్రపక్షాల కూటామి కూడా వేరే కుంపటి పెట్టుకుని ఎన్నికల బరిలోకి దిగి విడిగా పోటీచేయడంతో గెలుపుపై అశలు సన్నగిల్లుతున్న వేళ.. మళ్లీ మరో ఎత్తుగడ వేసింది. లక్ష్మీకాంత్ పర్సేకర్ ముఖ్యమంత్రిగా వున్న హయాంలో ప్రజలు పార్టీకి దూరమయ్యారన్న భావన కల్గించకుండా.. బీజేపి అధికారంలోకి వస్తే అంతకు ముందు ముఖ్యమంత్రిగా వున్న ప్రస్తుత రక్షణశాఖ మంత్రిగా బాధ్య‌త‌లు నిర్వ‌హిస్తోన్న మనోహర్‌ పారికర్ పేరును పార్టీ పరోక్షంగా ప్రజల ముందు పెట్టేలా చేసింది.

ఫిబ్రవరి 4న గోవా అసెంబ్లీకి ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్న నేప‌థ్యంలో ఆ రాష్ట్రంలో త‌మ‌ భార‌తీయ జ‌న‌తా పార్టీ గెలిస్తే మ‌ళ్లీ మ‌నోహ‌ర్ పారిక‌రే ముఖ్య‌మంత్రిగా ప్ర‌మాణ స్వీకారం చేస్తార‌ని కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ పరోక్షంగా చెప్పారు. ప్ర‌స్తుతం ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రకటించకుండానే ఆ రాష్ట్రంలో బీజేపీ ప్ర‌చారంలో పాల్గొంటోంది. ఆ రాష్ట్ర‌ ఎమ్మెల్యేలు నిర్ణయం తీసుకుంటే ఢిల్లీలో ఉన్న ఒక నేత సీఎం అవుతారని నితిన్ గ‌డ్క‌రీ మీడియాకు తెలిపారు. కొత్త‌గా శాస‌న‌సభ‌కు ఎన్నిక‌య్యే నేత‌లే వారి సీఎం ఎవ‌రో నిర్ణయిస్తారని అన్నారు. ఢిల్లీ నుంచి తాము సీఎం అభ్యర్థిని పంపిస్తామ‌ని వ్యాఖ్యానించారు. మ‌నోహ‌ర్‌ పారికర్ మళ్లీ గోవా రాష్ట్ర రాజకీయాల్లోకి వ‌స్తార‌ని, ఈ అంశంపై త‌మ అధిష్ఠానం కూడా అనుకూలంగా ఉందని బీజేపీ వర్గాలు అంటున్నాయి. ఈ అంశాన్ని ప్రధాని నరేంద్రమోదీ, అమిత్ షా కూడా ప‌రిశీలిస్తున్నట్లు తెలుస్తోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles

Today on Telugu Wishesh