వాట్సాప్ పెళ్లిళ్లు... ఎలా చేస్తారంటే... | Saudi marriage officials create a WhatsApp group for marriage.

Whatsapp group for matchmaking

Saudi Arabia, Whats App, Whats App marriages, Saudi Arabia Marriages, WhatsApp group for marriages, Whats App matrimonial, Polygamy whats app group

A group of marriage officials in Saudi Arabia have formed a group on Whats App to match make men with multiple wives in an attempt to deal with the 'problem' of a rising number of divorced women, widows, and spinsters in the country.

వాట్సాప్ ను ఇలాగ కూడా వాడొచ్చా?

Posted: 01/12/2017 09:21 AM IST
Whatsapp group for matchmaking

సోషల్ మీడియా ద్వారా వివాహ బంధాలు విడిపోవటం ఇప్పటి దాకా చూశాం. అయితే ఇకపై అవే మైక్రోబ్లాగింగ్ సైట్లను పెళ్లిళ్లు చేసేందుకు వాడబోతున్నారంట. వాట్సాప్ సాయంతో ఇక పెళ్లిళ్లు కూడా జ‌ర‌గ‌నున్నాయి. ఇందుకోసం కొందరు మెసేజింగ్ యాప్‌లో మ్యాట్రిమోనీ గ్రూప్‌ను క్రియేట్ చేశారు.

సౌదీలో విడాకులు తీసుకునే వారి సంఖ్య రోజురోజుకు పెరిగిపోతోంది. దీంతో విడాకులు తీసుకుని ఒంట‌రిగా ఉంటున్న మ‌హిళ‌ల‌కు కొత్త జీవితాన్ని ప్ర‌సాదించాల‌ని భావించిన సౌదీకి చెందిన ఎనిమిది మంది అధికారులు విశాల హృద‌యంతో ఆలోచించి పాలిగ‌మీ పేరిట వాట్సాప్‌లో ప్ర‌త్యేకంగా ఓ గ్రూపును క్రియేట్ చేసి మ్యాట్రిమోనీని అందుబాటులోకి తెచ్చారు. ఇందులో విడాకులు తీసుకున్న వారు, వివాహం కానివారు, భ‌ర్త‌ను పోగొట్టుకున్న‌వారు త‌మ పేర్లు న‌మోదు చేసుకోవ‌చ్చు.

విశేషం ఏమిటంటే, అందుబాటులోకి వ‌చ్చిన కొన్ని రోజుల్లోనే మొరాకో, సిరియా, యెమ‌న్‌, చైనా, బంగ్లాదేశ్‌, పాకిస్థాన్‌కు చెందిన దాదాపు 900 మంది మ‌హిళ‌లు ఈ గ్రూపులో త‌మ పేర్లు న‌మోదు చేసుకున్నారు. వీరిలో 18 నుంచి 55 ఏళ్ల వ‌య‌సున్న వారే ఎక్కువ‌మంది ఉన్నారు. ఇక తన 8 మంది పిల్లలను సరిగ్గా చూసుకునే భర్త కావాలని ఓ మహిళ పోస్ట్ చేయగా, ఖురాన్ ను కంఠస్తం చేసిన వ్యక్తి తనను సంప్రదించాలని ఓ యువతిని రిక్వెస్ట్ చేస్తోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : WhatsApp group  polygamy  Saudi Arabia  Marriages  

Other Articles