శాతకర్ణి బెనిఫిట్ షో టాక్ ఒక్క నెగటివ్ లేదా? రాజమౌళి రివ్యూ ఏంటి? | Gautamiputra Satakarni benefit show report.

Gautamiputra satakarni benefit show talk

Gautamiputra Satakarni, benefit show report, Positive reports for Satakarni, Rajamouli tweet on GPSK, Rajamouli at Gautamiputra Satakarni benifit show, Positive reports to Gautamiputra Satakarni, Gautamiputra Satakarni first review

Positive reports to Gautamiputra Satakarni benefit show report. Director Rajamouli also praised GPSK team in twitter after watching movie. Rajamouli review on Gautamiputra Satakarni

శాతకర్ణి ఫస్ట్ టాక్: శతయోధుడి బ్లాక్ బస్టర్

Posted: 01/12/2017 08:43 AM IST
Gautamiputra satakarni benefit show talk

నందమూరి అభిమానులకు పండగ లాంటి వార్త. నటసింహ బాలయ్య వందవ చిత్రం 'గౌతమీపుత్ర శాతకర్ణి'పై రివ్యూలు పాజిటివ్ గా వస్తున్నాయి. బెనిఫిట్ షోలు ముగిసిన అనంతరం సినిమా బ్లాక్ బస్టర్ గా ఉందంటూ చెబుతున్నారు. అభిమానులకే కాదు, సగటు ప్రేక్షకుడు కూడా శాతకర్ణిపై సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

బాలయ్య నటనకు తోడు, యుద్ధ దృశ్యాలు అద్భుతమని, సాయి బుర్రా మాధవ్ డైలాగులు పేలాయని, జ్ఞానశేఖర్ సినిమాటోగ్రఫీ, చిరంథన్ భట్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ చిత్రాన్ని అందరికీ నచ్చేలా చేశాయని వెల్లడించారు. మంచి క్వాలిటీతో, అంచనాలకు తగ్గట్టు చిత్రాన్ని క్రిష్ రూపొందించారని చెబుతున్నారు.

ముఖ్యంగా చిత్రంలో అన్నీ పాజిటివ్స్ యేనని, నెగటివ్స్ లేవని సినిమా చూసినవారు అంటున్నారు. ఓ హాలీవుడ్ చిత్రాన్ని చూసిన అనుభూతి కలుగుతోందని, బాలయ్య ఒంటి చేత్తో సినిమా నడిపించాడని చెబుతున్నారు. తెలుగు ప్రజలకు అంతగా తెలియని తెలుగు చక్రవర్తి సత్తాను బాలయ్య నటనలో చూస్తూ, ప్రేక్షకులు అమితానందాన్ని పొందవచ్చని అంటున్నారు. అయితే వార్ సీన్లు సాగదీసినట్లు ఉన్నాయని, అయినప్పటికీ బ్యాగ్రౌండ్ స్కోర్ తో వాటిని హైలెట్ చేశారని అంటున్నారు.

ఇక ఈ ఉదయం నటసింహం బాలకృష్ణతో కలసి 'గౌతమీపుత్ర శాతకర్ణి' చిత్రాన్ని హైదరాబాద్ లోని భ్రమరాంబ థియేటరులో చూసిన రాజమౌళి, తన ట్విట్టర్ ఖాతాలో స్పందించాడు. "సాహో బసవతారకరామ పుత్రా బాలకృష్ణా! శాతకర్ణి చిత్రంలో మీ నటన నందమూరి తారకరామారావును గర్వపడేలా చేస్తుంది. ఆయన పైనుంచి ఆశీస్సుల వర్షం కురిపిస్తుంటారు. ప్రపంచవ్యాప్తంగా 12 కోట్ల మంది తెలుగువారి ఆశీస్సులు అంజనాపుత్ర క్రిష్ వెంటే ఉంటాయి. నా సెల్యూట్" అని ట్వీట్ చేశారు. నిమిషాల్లో ఈ ట్వీట్ వందల సంఖ్యలో రీట్వీట్లను తెచ్చుకుంది.

"ఈ కథను 79 రోజుల్లో ఇంత అద్భుతంగా ఎలా తీశారు? నమ్మశక్యం కావడం లేదు. మీ నుంచి నేను ఎంతో ఎంతో నేర్చుకోవాలి. సాయి మాధవ్... నీ కలమే శాతకర్ణి ఖడ్గం. అద్భుతమైన కెమెరా పనితనం, అత్యద్భుతమైన నిర్మాణ విలువలు శాతకర్ణి చిత్రాన్ని సుదీర్ఘకాలం పాటు గుర్తుండిపోయేలా చేశాయి. ఈ చిత్రం తెలుగు పరిశ్రమకు గర్వకారణం" అని ఆయన ట్వీట్ చేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Gautamiputra Satakarni  Benefit Show report  

Other Articles