లాలూకు రూ.10 వేల పింఛను.. గతం వెంటాడుతుంది.. Lalu Yadav to get Rs 10,000 monthly JP Senani Samman Pension

Lalu prasad yadav to get rs 10 000 monthly jp senani samman pension

lalu, lalu prasad yadav, pension for lalu yadav, jp senani samman pension, lalu yadav pension

RJD President Lalu Prasad would get JP Senani Samman Pension of Rs 10,000 per month after being declared eligible for it.

లాలూకు రూ.10 వేల పింఛను.. గతం వెంటాడుతుంది..!

Posted: 01/11/2017 09:27 PM IST
Lalu prasad yadav to get rs 10 000 monthly jp senani samman pension

బిహార్‌ మాజీ ముఖ్యమంత్రి, ఆర్జేడీ అధినేత లాలుప్రసాద్‌ యాదవ్‌కు రూ.10 వేల పింఛన్‌ లభించనుంది. ‘జేపీ సేనాని సన్మాన్‌ పింఛన్‌ పథకం’ కింద ఆయనకు ఈ మొత్తాన్ని పెన్షన్‌ రూపంలో మంజూరు చేస్తున్నట్లు బిహార్‌ హోంశాఖ వెల్లడించింది. ఒక నెల నుంచి ఆరు నెలల వరకు జైలు జీవితాన్ని గడిపిన వారికి రూ.5 వేలు, ఆరు నెలల కన్నా ఎక్కువ రోజులు జైలులో గడిపిన వారికి రూ.10 వేల పింఛన్‌ ఇచ్చేలా 2009లో అప్పటి ముఖ్యమంత్రి నితిశ్‌కుమార్‌ ఈ పథకాన్ని దివంగత లోక్‌నాయక్‌ జయప్రకాష్‌ నారాయన్‌ (జేపీ) గౌరవార్థం ప్రకటించారు.

1974లో జేపీ ప్రారంభించిన సంపూర్ణ క్రాంతి ఉద్యమంలో విద్యార్థి సంఘాలకు నాయకుడిగా లాలు ప్రసాద్‌ యాదవ్‌ పాల్గొన్నారు. అంతర్గత భద్రత నిర్వహణ చట్టం (మీసా) కింద ఆరు నెలలకు పైగా జైలు జీవితం గడిపారు. ఈ పథకానికి లాలుప్రసాద్‌ కూడా అర్హుడని తేలడం‍తో ఆయన పెట్టిన దరఖాస్తును హోంశాఖ పరిగణనలోకి తీసుకుని పింఛన్‌ మంజూరు చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ పథకం కింద బిహార్‌లో 3,100 మందికి పింఛన్‌ లభిస్తోంది. ఇందులో బీజేపీ నేత సుశీల్‌కుమార్‌ మోదీ కూడా ఉన్నారు. కాగా, ముఖ్యమంత్రి నితీశ్‌కుమార్‌ కూడా ఈ పథకానికి అర్హుడిగా ఉన్నా..ఆయన పింఛన్‌ తీసుకోవడం లేదని అధికార వర్గాలు తెలిపాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles

Today on Telugu Wishesh