భార్య, బిడ్డల చేత కన్నీరు పెట్టించిన బరాక్ ఒబామా..! Michelle, Malia tear up after president’s farewell speech

Michelle malia obama tear up after president s touching tribute during farewell speech

Barack Obama, Malia obama, michelle obama, Sasha Obama, US President, white house, chicago, America

"Malia and Sasha, under the strangest of circumstances, you have become two amazing young women, smart and beautiful," President Obama said during his farewell address.

ITEMVIDEOS: భార్య, బిడ్డల చేత కన్నీరు పెట్టించిన బరాక్ ఒబామా..!

Posted: 01/11/2017 07:56 PM IST
Michelle malia obama tear up after president s touching tribute during farewell speech

అమెరికా అధ్యక్షుడు బరాక్‌ ఒబామా తన భార్య, పిల్లల చేత కన్నీరు పెట్టించారు. వరుసగా రెండు పర్యాయాలు అమెరికా అధ్యక్షుడిగా వున్న బరాక్ ఒబామా.. ఇవాళ జరిగిన తన వీడ్కోలు కార్యక్రమంలో తన భార్య పిల్లల గురించి ప్రసంగంలో భాగంగా చెప్పుకొచ్చారు. అంతే తన గురించి తన తండ్రి అంత పెద్ద సంఖ్యలో హాజరైన కార్యక్రమంలో చెప్పడంతో భావోద్వేగానికి గురైన మాలియా ఒబామాచ (18) కంట కన్నీరు ఉబికి వచ్చింది. అమె ఎంత ప్రయత్నించినా వాటిని అపుకోలేకపోయింది.

కూతిరు మాలియానే కాదు ఒబామా సతీమణి మిషెల్లీ కళ్లలో కూడా నీళ్లు తిరిగాయి. ఇలా శ్వేతసౌదాన్ని విడిచి వెళ్తున్న ఎనమిదేళ్లకు వారి కంట కన్నీరు చూశారు ఒబామా. చికాగో నగరంలో 20,000 మందికి పైగా హాజరైన ఈ సమావేశంలో భార్య మిషెల్‌ను ఉద్దేశించి ఒబామా మాట్లాడుతూ ‘పాతికేళ్లుగా నువ్వు నా ప్రతి కష్టసుఖాల్లో తోడున్నావు. నువ్వు నా భార్యవి, నా బిడ్డలకు తల్లివి మాత్రమే కాదు నా బెస్ట్‌ ఫ్రెండ్‌వి. శ్వేత సౌధాన్ని అందరిదిగా మార్చావు. నేనే కాదు యావత్‌ దేశం గర్వపడేలా చేశావు’ అని అన్నారు.

ఈ వ్యాఖ్యలతో పెద్ద కూతురు మాలియా (18) ఉద్వేగానికి లోనై కంటతడి పెట్టింది. ఉబికివస్తున్న కన్నీళ్లను ఆపుకున్న ఒబామా కూతుళ్లు మాలియా, సాషాలనుద్దేశించి మాట్లాడుతూ‘మీరిద్దరూ అందమైన, తెలివైన పిల్లలు. మీ ఇద్దరికీ మంచి అభిరుచి ఉంది. నావల్ల మీరు కొన్నిసార్లు అనవసరంగా ఇబ్బందులు ఎదుర్కొని ఉండవచ్చు. మీ ఇద్దరి తండ్రిని అయినందుకు నేనెంతో గర్వపడుతున్నాను’ అని ఒబామా అన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Barack Obama  Malia obama  michelle obama  Sasha Obama  US President  white house  chicago  America  

Other Articles

Today on Telugu Wishesh