యదేశ్చగా సరిహద్దులు దాటుతున్న ఉగ్రవాదులు.! LeT terrorists attempting infiltration, spotted in Jammu and Kashmir

Let terrorists attempting infiltration spotted in jammu and kashmir

Lashkar-e-Taiba, Hizb-ul Mujahideen, Terror, Terrorist organisations, Kashmir,Valley, Jammu and Kashmir, Intel agencies, infiltrations

As the new terror video emerges, the millitants from the two terror groups Hizbul Mujahideen and Lashkar-e-Taiba were seen at an unknown location in South Kashmir, carrying AK-47 rifles.

ITEMVIDEOS: యదేశ్చగా సరిహద్దులు దాటుతున్న ఉగ్రవాదులు..!

Posted: 01/11/2017 06:55 PM IST
Let terrorists attempting infiltration spotted in jammu and kashmir

దేశం నివ్వెరపోయింది.. పాకిస్థాన్ అక్రమిత కాశ్మీర్ లోకి వెళ్లి మరీ సర్జికల్ స్ట్రైక్స్ చేశామని భారత అర్మీ ప్రకటించిన తరువాత.. పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు యదేశ్చగా భారత సరిహద్దు ప్రాంతంలోకి అక్రమంగా చొచ్చుకొస్తున్న వీడియో కలకలం రేపుతోంది. టెర్రరిస్టులు స్వేచ్ఛగా విహరించటంతో పాటు మంచు కొండల్లో స్నోబాల్ ఆటలతో ఎంజాయ్ చేయటం దేశ ప్రజలతో పాటు భారత అర్మీని కూడా ఒక్కసారిగా షాకింగ్ గురి చేసింది.

ఓ చేతిలో ఏకే  47తుపాకీ.. మరో చేతిలో మంచు ముద్దలను తమ తోటి ఉగ్రవాదులపైకి విసురుకుంటూ ఆడుకోవటం విస్మయానికి గురిచేసింది. జమ్మూకాశ్మీర్ బోర్డర్ లో మంచుపర్వతాలు దాటుకుని టెర్రరిస్టులు ఇండియాలోకి ప్రవేశిస్తున్నారు. 12 మంది ఉన్న తీవ్రవాద ముఠా.. చేతుల్లో AK 47 తుపాకులు ఉన్నాయి. నల్లటి దుస్తుల్లో ఉన్నారు. చలికి తట్టుకునే విధంగా పెద్దపెద్ద కోటులు ధరించి ఉన్నారు. మంచుకొండల్లో నడిచి వస్తూ.. మధ్యలో ఆగిన సమయంలో ఐస్ ముద్దలతో ఆటలాడారు.

జమ్మూ భద్రతా సిబ్బంది చేతికి అందిన ఈ వీడియోని పోలీసులు నిశితంగా పరిశీలిస్తున్నారు. ఈ వీడియో ఏ ప్రాంతంలో తీసిందన్న విషయమై దర్యాప్తు చేస్తున్నారు. అయితే మరో షాకింగ్ న్యూస్ ఏటంటే.. ఇన్నాళ్లుగా వేర్వేరుగా వున్న రెండు ఉగ్రవాద గ్రూపులు లష్కరే తోయిబా, హిజ్ బుల్ ముజాహిద్దీన్ లకు చెందిన ఉగ్రవాదలు అందులో వున్నారని, భారత్ లో అలజడి సృష్టించే విషయంలో ఈ రెండు తీవ్రవాద గ్రూపులు ఒక్కటయ్యాయని కూడా పోలీసుల పరిశీలనలో తేలింది. ఈ నెల 7న సోషల్ మీడియాలో పోస్ట్ అయిన వీడియో కాశ్మీర్ లోనే సంచరిస్తూ వీడియోకు చిక్కారని, అయితే ఈ వీడియో ఎంతవరకు వాస్తమైనదో పోలీసులు నిర్థారించే పనిలో వున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles