‘వరాహ బాహుబలి’ కెమిస్ట్రీ అలా కుదిరింది | Boy rides on pig in East Godavari.

Boy rides pig east godavari

East Godavari, Mahesh ride pig, Varaha Baahubali, Bou ride on Pig, Pig Boy relation, Boy Rides Pig, East Godavari Baahubali, Kid on Pig, Mahesh Pig rider

East Godavari Boy Mahesh ride on Pigs and popular as Varaha Baahubali.

ITEMVIDEOS:వరాహ బాహుబలిని చూస్తారా?

Posted: 01/10/2017 03:38 PM IST
Boy rides pig east godavari

జిహ్వకో రుచి అన్నట్లు ఈ బుడ్డొడి బుర్రలో పుట్టిన కొత్త ఆలోచన మీడియాలో అతన్ని హీరోని చేసేసింది. ఏకంగా పందితో... సారీ వరాహంతో ఇప్పుడు అతగాడు తెగ పాపులర్ అయిపోయాడు. ఏ గుర్రమో, ఏనుగో కాదు వరాహాన్ని తన వాహనం చేసుకుని అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తున్నాడు.

తూర్పుగోదావరి జిల్లా యూ కొత్తపల్లి మండలం కొండెవరంకు చెందిన మహేష్ తండ్రి వృత్తి రీత్యా పందుల్ని పెంచుతుంటాడు. దీంతో ఆ పిల్లాడికి చిన్నప్పటి నుంచి ఫ్రెండ్ షిఫ్ బాగా కుదిరింది. ఆ చనువుతోనే వాటి మీద ఎక్కి సవారీ చేయటం నేర్చుకున్నాడు. సరదాగా మొదలైన ఆ వ్యాపకం తర్వాత సీరియస్ అయ్యింది. ఎంతలా అంటే చివరికి స్కూల్ కి కూడా వాటిపైనే వెళ్తున్నాడు.

 

మహేష్ ముచ్చటను తీరుస్తూ అవి కూడా జాగ్రత్తగా మనోడిని పిక్ అండ్ డ్రాప్ చేసుకుంటున్నాయి. కేవలం వాటిపై ట్రావెల్ చేయటమే కాదు, నిల్చుని సర్కస్ ఫీట్లు చేయటం మనోడికి హాబీగా మారిపోయింది. మహేష్‌ ఫ్రెండ్స్ కూడా ఆ స్వారీ ఎంజాయ్ చేద్దామంటే అవి కనీసం దగ్గరికి కూడా రానివ్వటం లేదంట. ఆ ఊరంతా అతగాడికి పెట్టుకున్న ముద్దు పేరు తెలుసా? వరాహ బాహుబలి అని...

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Mahesh  Pig rider  Varaha Baahubali  

Other Articles