సంక్రాంతి సెలవుల తేదీలు మారిపోయాయా? | Sankranthi holidays changed in Telangana.

Telangana government changed sankranthi holidays

Telangana government, Sankranthi 2017, Sankranthi Holidays, Telangana Sankranthi Holidays, AP Sankranthi, Sankranthui festival 2017, Sankranthi Holidays Andhra Pradesh

Telangana government declared five days holiday for Sankranthi 2017.

సంక్రాంతి సెలవు తేదీలు మారిపోయాయి

Posted: 01/10/2017 07:48 AM IST
Telangana government changed sankranthi holidays

సంక్రాంతి సెల‌వుల్లో స్వల్ప మార్పులు చేస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నెల 12 నుంచి 16 దాకా సెలవులు ఉన్నట్లు తెలుపుతూ పాఠ‌శాల‌ విద్యాశాఖ సోమ‌వారం మ‌రో ప్ర‌క‌ట‌న చేసింది. తొలుత ఈనెల 11 నుంచి 15వ తేదీ వ‌ర‌కు సెల‌వులు ప్ర‌క‌టించిన ప్ర‌భుత్వం 16న పాఠ‌శాల‌లు పునఃప్రారంభ‌మ‌వుతాయ‌ని పేర్కొంది. అయితే ప్రభుత్వ సెలవుల ప్రకారం ఈ నెల 15న పండుగ నిర్వహిస్తున్న క్రమంలో తిరిగి సెలవు దినాలలో మార్పులు చేసినట్లు తెలిపారు.

దూర ప్రాంతానికి వెళ్లే ఉపాధ్యాయులు, విద్యార్థులు తిరిగి 16న స్కూలుకు చేరుకోవాలంటే పండుగ‌నాడే బ‌య‌లుదేరాల్సి ఉండ‌డంతో తేదీలను సవరిస్తున్నట్లు తెలిపింది. అందుకే 11వ తేదీకి బ‌దులు సెల‌వులు 12 నుంచి ప్రారంభ‌మ‌వుతాయ‌ని పేర్కొంది. పాఠ‌శాల‌లు తిరిగి 17న పునఃప్రారంభ‌మ‌వుతాయని పేర్కొంటూ ఉత్త‌ర్వులు జారీ చేసింది. ఈ నెల 12 నుంచి 16 వరకు సంక్రాంతి (ఐదు రోజులు)సెలవులు ప్రకటిస్తూ విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రంజీవ్ ఆర్ ఆచార్య సోమవారం నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు చర్యలు చేపట్టాలని ఆ శాఖ డైరెక్టర్‌కు విద్యాశాఖ ప్రత్యేక కార్యదర్శి ఆదేశాలు జారీ చేశారు.

కాగా, ఏపీలో 9 నుంచి(నిన్నటి నుంచి) సంక్రాంతి సెలవులు మొదలయ్యాయి కూడా. పండుగ సందర్భంగా ప్రత్యేక రైళ్లు నడుపుతోంది దక్షిణ మధ్య రైల్వే. ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని సికింద్రాబాద్ -కాకినాడ మధ్య 8 ప్రత్యేక రైళ్లు ఏర్పాటు చేసింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Telangana  Sankranthi Festival  2017 holidays  

Other Articles