ఈసీకి కాలింది... సైకిల్ ఛాన్స్ కొడుక్కే దక్కేనా? | No dispute between Akhilesh and me Mulayam says.

Team akhilesh says want cycle soonest

Mulayam Singh Yadav, Akhilesh Yadav, Cycle Symbol, Samajwadi Party, Uttar Pradesh Cycle, Mulayam Akhilesh Cycle, Mulayam Singh Election Commission, Akilesh Yadav Election Commission, Team Akhilesh, Akilesh Cycle Race, UP cycle politics

Mulayam Singh Yadav Claims 'No Rift', Team Akhilesh Says Want 'Cycle' Soonest.

బాబోయ్... సైకిల్ పై త్వరగా తేల్చండి!

Posted: 01/09/2017 05:51 PM IST
Team akhilesh says want cycle soonest

యూపీ రాజకీయాల్లో సైకిల్ సింబల్ పెట్టిన చిచ్చు మరో ములుపు తిరిగింది. విబేధాలు లేవంటూనే తండ్రి-కొడుకులు ఎన్నికల సంఘం అధికారిని కలవటం, సమాజ్ వాదీ గుర్తుపై సర్వహక్కులు మావేనంటూ మీడియా ముందు వాదులాడటం చూశాం. ఈ నేపథ్యంలో సైకిల్ ఎవ‌రిది? అనే అంశాన్ని తేల్చ‌డానికి త‌మ‌కు నివేదిక స‌మ‌ర్పించాలంటూ ఈసీ ఇచ్చిన గ‌డువు ఈ రోజుతో ముగిసింది.

ఇప్ప‌టికే ఉత్త‌ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి అఖిలేష్ వ‌ర్గం ఈసీకి అఫిడ‌విట్ ఇచ్చి ఆ గుర్తు త‌మ‌కే ద‌క్కుతుంద‌ని ధీమా వ్య‌క్తం చేయగా, సోమవారం పార్టీ పెద్ద, నేతాజీ ములాయం సింగ్ యాద‌వ్ ఎన్నిలక కార్యాలయంకి వెళ్లారు. అక్కడ మీడియాతో మాట్లాడుతూ... త‌మ పార్టీలో జ‌రుగుతున్న గొడవల వెనుక ఓ వ్యక్తి(రాంగోపాల్ యాదవ్ ను ఉద్దేశించి) ఉన్నాడని వ్యాఖ్యానించారు. అతని మూలంగానే త‌మ‌ పార్టీలో ఓ సమస్య వచ్చిపడిందని చెప్పారు. తనకు, అఖిలేష్‌కు మధ్య ఎలాంటి వివాదాలు లేవ‌ని, తమ పార్టీలో నెలకొన్న సమస్యలు పరిష్కారమవుతాయని వ్యాఖ్యానించారు.

మరోవైపు ఈ విషయంలో అత్యధిక పార్టీ ప్రజా ప్రతినిధులు అఖిలేష్ వెంట ఉన్నారని పేర్కొన్న ఈసీ, ఎన్నికల గుర్తుపై మీరే తేల్చుకుని ఓ నిర్ణయానికి రావాలని స్పష్టం చేసినట్టు తెలుస్తోంది. అందుకు నేటి సాయంత్రం వరకూ సమయమిస్తున్నామని, ఓ నిర్ణయానికి రాకుంటే, నిబంధనల ప్రకారం తాము వ్యవహరిస్తామని ఈసీ వెల్లడించినట్టు తెలుస్తోంది. కాగా, ములాయం తరువాత, అఖిలేష్ సాయంత్రం మరోసారి ఈసీ అధికారులను కలవనున్నట్టు తెలుస్తోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Akilesh Yadav  Mulayam Singh Yadav  Uttar Pradesh  Cycle politics  

Other Articles