వార్నింగ్: ఫ్రీ వైఫై తో ఆ లావాదేవీలు అస్సలు చేయకండి | Do not use free wifi for online transactions.

Free wi fi for online banking not safe

Free Wi-Fi, online banking, Cyber experts Free Wi-Fi, Free Wi-Fi online banking, Free Wifi for online transactions, online banking issues, Free wifi not safe

Cyber experts alert people that Free Wi-Fi for online banking is not safe.

జాగ్రత్త! ఫ్రీ వైఫై కదా అని వాడారో...

Posted: 01/10/2017 09:22 AM IST
Free wi fi for online banking not safe

వైఫై ఈ పేరు ఇప్పుడు వినిపించని ప్రాంతం లేదు. ప్రజలను ఆకట్టుకునేందుకు ప్రభుత్వాలు, వినియోగదారులను ఆకర్షించేందుకు వ్యాపార సంస్థలు ప్రీ వైఫై మంత్రాన్ని జపిస్తున్నాయి కూడా. అయితే ప్రస్తుత క్యాష్ లెస్ పరిస్థితుల్లో ఉచితంగా దొరికింది క‌దా అని ఆన్‌లైన్ ట్రాన్సాక్ష‌న్స్ చేస్తే మీ పని అయినట్లే అని హెచ్చరిస్తున్నారు.

సైబ‌ర్ నిపుణులు సూచించించేది ఏంటంటే... న‌గ‌దు ర‌హిత లావాదేవీలపై నేరగాళ్లు 24/7 కన్నేసి ఉంటారని చెబుతున్నారు. కొంద‌రికి మూడునాలుగు బ్యాంక్ అకౌంట్లు ఉంటాయి. అన్ని ఖాతాల‌కు ఆన్‌లైన్ బ్యాంకింగ్ స‌హా క్రెడిట్‌, డెబిట్ కార్డుల‌ను ఉప‌యోగిస్తుంటారు. సరిగ్గా ఇదే సైబ‌ర్ మోస‌గాళ్ల‌కు అనువుగా మారుతుంది. సాధార‌ణంగా చాలామంది ఖాతాదారులు త‌మ పాస్‌వ‌ర్డ్‌ల‌ను సుల‌భంగా గుర్తుపెట్టుకునేలా క్రియేట్ చేసుకుంటారు. అంటే నిక్‌నేమ్‌, ఇంటిపేరు, మొబైల్ నంబ‌రులోని మొద‌టి, చివ‌రి నంబ‌రు, పుట్టిన తేదీలు, బైక్ నంబ‌రు.. ఇలా సుల‌భంగా ఉన్న‌వి పెట్టుకుంటారు. ఇలా చేయ‌డం వ‌ల్ల హ్యాక‌ర్ల‌కు ఈజీగా దొరికిపోతారు.

కాబ‌ట్టి పాస్‌వ‌ర్డ్ ఎప్పుడు నంబ‌ర్లు, లెట‌ర్ల‌తో క‌ల‌గాపుల‌గంగా ఉండాలి. ఏటీఎం పిన్ నంబ‌రును ఎవ‌రికీ చెప్ప‌కూడ‌దు. బ్యాంకు ఖాతాల విష‌యంలో గోప్య‌త అవ‌స‌రం. ఇంట‌ర్‌నెట్ కేఫ్‌, ఇత‌రుల కంప్యూట‌ర్ల ద్వారా ఆన్‌లైన్ బ్యాంకింగ్ చేయ‌డం ప్ర‌మాద‌క‌రం. మ‌రీ ముఖ్యంగా ఉచిత వైఫ్‌తో చేయ‌డం అత్యంత ప్ర‌మాద‌క‌రం. ఎవరు పడితే వారు లాగిన అయ్యే అవకాశంతోపాటు, డేటాను తస్కరించే అవకాశం ఉన్నట్లు తెలిపారు. ఖాతాల్లోని న‌గ‌దు అక‌స్మాత్తుగా మాయమైతే ఏం చేయాలో కూడా వారు చెబుతున్నారు. నిర్లక్ష్యం, జాప్యం రెండూ చేయకుండా వెంటనే వాటి లావాదేవీలను ఆపేయించటమే కాదు, సంబంధిత ఫిర్యాదులు కూడా చేయాలని చెబుతున్నారు.

ఆన్‌లైన్ ట్రాన్సాక్ష‌న్స్ జ‌రిపే కంప్యూట‌ర్‌లో త‌ప్ప‌కుండా అప్‌డేటెడ్ సాఫ్ట్‌వేర్ ఉండాల‌న్ని విష‌యాన్ని ప్ర‌తి ఒక్క‌రు గుర్తుపెట్టుకోవాలి. అలాగే యాంటీ వైర‌స్‌, యాంటీమాల్‌వేర్ సాఫ్ట్‌వేర్లు కూడా ఉండాల్సిందే. అంతేకాదు ఇవి ఎప్ప‌టిక‌ప్పుడు అప్‌డేల్ అవుతుండాలి. మార్కెట్లో అందుబాటులో ఉన్న ప‌లు ర‌కాల ఓఎస్‌లు, యాంటీవైర‌స్, మాల్‌వేర్‌ల‌ను ఇన్‌స్టాల్ చేసుకోవ‌డం ద్వారా సైబ‌ర్ నేర‌గాళ్ల‌కు చెక్‌పెట్టొచ్చు. భార‌త్‌లో అభివృద్ధి చేసిన భార‌త‌ ఆప‌రేటింగ్ సిస్టమ్స్ స‌ర్వీసెస్‌(బాస్‌) అయితే భ‌ద్ర‌త ప‌రంగా ఎంతో మంచిది. సైబ‌ర్ నేరాల‌కు సంబంధించిన సందేహాల‌ను www.infosecawarness.in వెబ్‌సైట్ ద్వారా కానీ, This email address is being protected from spambots. You need JavaScript enabled to view it." target="_blank" rel="alternate">This email address is being protected from spambots. You need JavaScript enabled to view it. అనే ఈ మెయిల్ ద్వారా కానీ నివృత్తి చేసుకోవ‌చ్చని తెలిపారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Free Wi-Fi  Cyber experts  online banking  transactions  

Other Articles