శశి వార్నింగ్ దీపకేనా? } Sasikala warn Deepa Jayakumar indirectly.

Sasikala says no one spilt aiadmk

AIADMK general secretary, Sasikala Natarajan, Stalin, Deepa Jayakumar, Sasikala Stalin, Sasikala Deepa, Deepa Jayakumar, Jayalalitha Sasikala, AIADMK spilt, Sasikala Natarajan AIADMK split

AIADMK general secretary Sasikala Natarajan warns Deepa Jayakumar about party spit.

శశికళ వార్నింగ్ ఆ ఇద్దరికేనా?

Posted: 01/09/2017 09:06 AM IST
Sasikala says no one spilt aiadmk

చిన్నమ్మ రంగంలోకి దిగింది. పార్టీలో గత కొంత కాలంగా కొనసాగుతున్న స్తబ్థతకు చెక్ పెట్టేందుకు పావులు కదుపుతోంది. ప్రధాన కార్యదర్శిగా తొలిసారి మీటింగ్ కు హాజరయ్యింది. ఈ సందర్భంగా జయ మేనకోడలు దీప నుంచి వస్తున్న కొత్త పార్టీ డిమాండ్, అన్నాడీఎంకే మద్ధతుదారులు కొందరు ఆమెకు సపోర్ట్ ఇవ్వటంపై, ప్రతిపక్ష నేత స్టాలిన్ చేస్తున్న వ్యాఖ్యలపై స్పందించింది.

ఎవ‌రెన్ని కుట్ర‌లు, కుతంత్రాలు చేసినా అన్నాడీఎంకేను చీల్చ‌డం ఎవ‌రి త‌ర‌మూ కాద‌ని పార్టీ చీఫ్ శ‌శిక‌ళ ధీమా వ్య‌క్తం చేశారు. పార్టీని బ‌లోపేతం చేయ‌డంతోపాటు ప‌ట్టు సాధించేందుకు గ‌త‌కొన్ని రోజులుగా జిల్లా కేడ‌ర్‌తో విస్తృత స‌మావేశాలు నిర్వ‌హిస్తున్న శ‌శిక‌ళ ఆదివారం పార్టీ కార్యాల‌యంలో తిరున‌ల్వేలి, తూత్తుకుడి, క‌న్యాకుమారి జిల్లాల నేత‌ల‌తో స‌మావేశం అయ్యారు.

అన్నాడీఎంకే అతిపెద్ద పార్టీ అని, దానిని చీల్చ‌డం అసాధ్య‌మ‌ని తేల్చి చెప్పారు. పార్టీని చీల్చేందుకు జోరుగా కుట్ర‌లు సాగుతున్నాయ‌ని, వాటిని భ‌గ్నం చేసి తీరుతామ‌ని పేర్కొన్నారు. జిల్లాలోని నేత‌లంద‌రూ కేడ‌ర్‌కు అందుబాటులో ఉండాల‌ని సూచించారు. జయ బతికి ఉండగా పార్టీని ఎలా కాపు కాచిందో.. తాను అలాగే చూసుకుంటానని తెలిపింది. నిత్యం ప్ర‌జ‌ల్లో ఉంటూ వారి స‌మ‌స్య‌ల‌ను ప్ర‌భుత్వం దృష్టికి తీసుకురావాల‌ని కోరారు. పార్టీకి వ్య‌తిరేకంగా జ‌రుగుతున్న ప్ర‌చారాలు, పుకార్ల‌ను ఎవ‌రూ న‌మ్మ‌వ‌ద్ద‌ని సూచిస్తూ కేడర్ లో మనోధైర్యం నింపే యత్నం చేసింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : AIADMK  Sasikala Natarajan  party Split  Deepa Jayakumar  

Other Articles

Today on Telugu Wishesh