తన గవర్నర్ పదవిపై కిరణ్ బేడీ సంచలన వ్యాఖ్యలు Kiran Bedi says she will quit LG post in May, 2018

Kiran bedi says she will quit lg post in may 2018

BJP, Congress, kiran bedi, Narayanasamy, Narendra Modi, differences, governor term, resignation, Puducherry, india news

Puducherry Lt Governor Kiran Bedi said on that she would quit the post in May next year on completion of two years in office.

తన గవర్నర్ పదవిపై కిరణ్ బేడీ సంచలన వ్యాఖ్యలు

Posted: 01/08/2017 08:56 AM IST
Kiran bedi says she will quit lg post in may 2018

ముఖ్యమంత్రి నారాయణస్వామితో విభేదాలతో మరోసారి వార్తల్లోకి వచ్చిన పుదుచ్చేరి లెఫ్టినెంట్‌ గవర్నర్‌ కిరణ్ బేడి సంచలన ప్రకటన చేశారు. పదవీ త్యాగానికి సిద్ధపడుతున్నట్టు వెల్లడించారు. వచ్చే ఏడాది గవర్నర్‌గిరిని వదులుకుంటానని ‘ఏఎన్‌ఐ’ వార్తా సంస్థతో చెప్పారు. 2018, మే 29 నాటికి తాను పదవిలోకి వచ్చి రెండేళ్లు పూర్తవుతుందని, తర్వాత తాను పదవిలో కొనసాగనని అన్నారు. దీని గురించి ప్రభుత్వ పెద్దలకు సమాచారం అందించినట్టు తెలుస్తోంది.

కిరణ్ బేడి ప్రకటన రాజకీయ వర్గాలను ఆశ్చర్యానికి గురిచేసింది. సీఎం నారాయణస్వామితో ఏర్పడిన విభేదాల కారణంగానే ఆమె ఈ నిర్ణయం తీసుకున్నారన్న ప్రచారం మొదలైంది. కేంద్ర హోంమంత్రి రాజ్‌ నాథ్‌ సింగ్‌ కు పుదుదచ్చేరి కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు ఫిర్యాదు చేసిన మరుసటి రోజే కిరణ్‌బేడి ఈ నిర్ణయం వెలువరించడం గమనార్హం. మాజీ ఐపీఎస్‌ అధికారి అయిన కిరణ్‌బేడి 2016, మే 29న పుదుచ్చేరి లెఫ్టినెంట్‌ గవర్నర్‌ గా బాధ్యతలు చేపట్టారు. శాంతిభద్రతల పరిరక్షణ, పరిసరాల పరిశుభ్రత, అవినీతి అంతం కోసం పలు చర్యలు చేపట్టారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : BJP  Congress  kiran bedi  Narayanasamy  Narendra Modi  differences  governor term  resignation  Puducherry  india news  

Other Articles