పోలీసులను అయోమయంలోకి నెట్టిన తల్లీకూతుళ్లు.. police confused over eve-teasing case

Police confused over eve teasing case

mother, daughter, vicky, eve-teasing, confused, hyderabad commisionerate, ‍harassment case, banjara hills police station, yousufguda, crime news

banjara hills police were confused by mother and daughter in a eve teasing case. mother files the case and daughter does not agree with it

పోలీసులను అయోమయంలోకి నెట్టిన తల్లీకూతుళ్లు..

Posted: 01/08/2017 08:19 AM IST
Police confused over eve teasing case

సాధారణంగా ఎవరికీ ఏ విషయం తెలిసినా- తెలియకపోయినా.. అనుమానాలు వున్నా వాటిని స్థానిక పోలీసులకు పిర్యాదు చేసి.. వాటిని పరిష్కరించాల్సిందిగా కోరుతారు. కానీ బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్ అధికారులను తల్లికూతుళ్లు అయోమయానికి గురిచేశారు. ఓ యువకుడిపై తల్లి పిర్యాదు చేయగా, కూతురు మాత్రం ఆ యువకుడిపై ఇచ్చిన పిర్యాదును వెనక్కుతీసుకుని, యువకుడ్ని విడిపించుకుపోయింది. ఈ రెండు ఘటనలు కేవలం గంట వ్యవధిలోపలే చోటుచేసుకోవడం గమనార్హం. వివరాల్లోకి వెళ్తే..

తన కూతురిని ఓ యువకుడు వేధిస్తున్నాడని తల్లి ఫిర్యాదు చేసిన గంటలోనే అలాంటిదేమీ లేదని తననెవరూ వేధించడం లేదంటూ కూతురు ఆ యువకుడిని పోలీస్‌స్టేషన్‌ నుంచి తీసుకెళ్లిన సంఘటన బంజారాహిల్స్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చోటుచేసుకొంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. యూసుఫ్‌గూడ ఎల్‌ఎన్‌నగర్‌కు చెందిన విక్కీ అనే యువకుడు తన కూతురును వెంటపడుతూ వేధిస్తున్నాడని ఓ మహిళ శనివారం బంజారాహిల్స్‌ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు.

అయితే తనను వేధించడం లేదని ఆయన వల్ల ఎలాంటి ఇబ్బందులు లేవని తన ఇష్ట్రపకారమే మాట్లాడుతున్నానంటూ సదరు యువతి పోలీసులకు లిఖిత పూర్వకంగా రాసి ఇచ్చింది.దీంతో ఎవరిని నమ్మాలో తెలియక పోలీసులు తలపట్టుకున్నారు. కూతురి మాట ప్రకారం పోలీసులు విక్కీని వదిలిపెట్టగా ఆమె స్వయంగా సదరు యువకుడిని బయటికి తీసుకురావడం విశేషం.  వీరిద్దరి మధ్య నడుస్తున్న ప్రేమ వ్యవహారం గిట్టక తల్లి ఆ యువకుడిపై పిర్యాదు చేసిందని పోలీసులు భావిస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles

Today on Telugu Wishesh