ఐదు రాష్ట్రాల ఎన్నికలపై మార్కండేయ ఖడ్జూ సంచలన వ్యాఖ్యలు Markandey Katju predicts BJP rout in UP elections

Markandey katju predicts bjp rout in up elections places bet on akhilesh led sp

markandey katju, justice katju, katju up elections, up polls katju, katju on akhilesh, akhilesh yadav, samajwadi party, katju on samajwadi party, katju bjp, katju up polls

Justice Katju said that the demonetisation move may cause more harm to BJP than benefit in the upcoming Assembly elections.

ఐదు రాష్ట్రాల ఎన్నికలపై మార్కండేయ ఖడ్జూ సంచలన వ్యాఖ్యలు

Posted: 01/07/2017 09:44 PM IST
Markandey katju predicts bjp rout in up elections places bet on akhilesh led sp

రానున్న ఐదు రాష్ట్రాల ఎన్నికలలో సామాజిక వర్గం, మతం ప్రాతిపదికనే జరగునున్నాయని సుప్రీంకోర్టు మాజీ జడ్జి జస్టిస్‌ మార్కండేయ కట్జూ జోస్యం చెప్పారు. మరీ ముఖ్యంగా అన్ని పార్టీల నేతలు ఆశలు పెట్టుకున్న ఉత్తర్ ప్రదేశ్ ఎన్నికలలో ఈ ప్రభావం మరీ అధికంగా వుంటుందని ఆయన స్పష్టం చేశారు. దీంతో ఉత్తరప్రదేశ్‌ ఎన్నికల్లో నరేంద్రమోదీ నేతృత్వంలోని బీజేపీ చిత్తుగా జోడిపోతుందని కూడా ఆయన పేర్కోన్నారు. యూపీ ఎన్నికల్లో సీఎం అఖిలేశ్‌ యాదవ్‌ నేతృత్వంలోని సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ)కి స్పష్టమైన మెజారిటీ వస్తుందని ఆయన అంచనా వేశారు.

ఎస్పీకి మూడింట రెండొంతుల మెజారిటీ వచ్చినా ఆశ్చర్యపోవడానికి లేదని ఆయన అభిప్రాయపడ్డారు. యూపీ ఎన్నికల్లో బీజేపీకి మాయావతి నేతృత్వంలోని బీఎస్పీ కన్నా తక్కువ సీట్లు వస్తాయని ఆయన అన్నారు. రానున్న యూపీ ఎన్నికలను విశ్లేషిస్తూ కట్జూ ఫేస్‌బుక్‌లో ఓ పోస్టు పెట్టారు. 'యూపీ సహా చాలా రాష్ట్రాల్లో ఎన్నికలు కులం, లేదా మత ప్రాతిపదికన జరుగుతాయి. ఏదైనా ప్రభంజనం ఉంటే అందుకు మినహాయింపు ఇవ్వవచ్చున్నారు.

2014 లోక్‌సభ ఎన్నికల్లో నరేంద్రమోదీ ప్రభంజనం నడిచింది. ఇప్పుడు యూపీలో ఎలాంటి గాలి వీయడం లేదు. కాబట్టి దాదాపుగా 90శాతం ఓటింగ్‌ కులం, మతం ఆధారంగా నమోదవుతుంది. ప్రభంజనం కోసమే పెద్దనోట్లను రద్దు చేసినప్పటికీ అది విజయవంతంకాలేదు. నిజానికి నోట్ల రద్దు వల్ల బీజేపీకి హాని జరిగే అవకాశముంది. ఈ నిర్ణయం వల్ల సామాన్యులు, చిన్న, మధ్య తరహా వ్యాపారులు, రైతులు బాగా దెబ్బతిన్నారు' అని కట్జూ పేర్కొన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles