ఆ నాయకుడి శవయాత్రలో బికినీ డాన్సర్ల ఆర్థనగ్న నృత్యం.. Taiwan politician's funeral features 50 pole dancers

50 strippers performed taiwanese politics in the last journey

taiwanees politician, last journey, final farewell, bikini clads, funeral, bikini girls, pole dancers, half naked dance, tung hsiang, Chinese internet, viral video

The funeral of Taiwanese politics Tung Syana turned into a bright spectacle. Relatives invited musicians and 50 girls danced on the roofs of cars in a funeral procession in half-naked form.

ITEMVIDEOS: ఆ నాయకుడి శవయాత్రలో బికినీ డాన్సర్ల అర్థనగ్న నృత్యం..

Posted: 01/07/2017 10:51 AM IST
50 strippers performed taiwanese politics in the last journey

అకలి రాజ్యం చిత్రంలో హీరో కమల్ హాసన్ తినడానికి ఏమీ లేక ఏడుస్తున్న స్నేహితుడ్ని ఓదార్చడానికి పాడిన పాట.. మన శ్రీరంగం శ్రీనివాసులు రచించిన పాట.. సపాటు ఏటు లేదు.. పాటైనా పాడు బ్రదర్.. రాజధాని నగరంలో వీధి వీధి నీదీ నాదే బ్రదరూ.. స్వత్రంత దేశంలో చావు కూడా పెళ్లి లాంటిదే బ్రదరూ.. గుర్తుందా..? అయితే అక్షరాలా ప్రస్తుతం కాలంతో చావులు కూడా పెళ్లిలా ఘనంగా నిర్విహిస్తున్నారు. చనిపోయిన వ్యక్తుల స్థాయిని, హోదాను బట్టి.. అన్నింటికన్నా ముఖ్యంగా అంతమ యాత్రలో మాత్రం అధికంగా ఖర్చుచేస్తున్నారు. అయితే తైవాన్ లో మాత్రం అక్కడి ఓ కౌన్సిలర్ అంతిమయాత్రలో వాళ్లు మరో అడుగు ముందుకేశారు.

అవునండీ ఏకంగా యాభై మంది పోల్ డాన్సర్లను ( బికినీ డాన్సర్లు)ను తీసుకువచ్చి.. మరీ అంతిమయాత్రలో వీధుల్లో వారితో నృత్యాలు వేయించారు. అది కూడా అర్థనగ్నంగా.. వివరాల్లోకి వెళ్తే.. ఎవరు ఔనన్నా.. ఎవరు కాదన్నా.. తైవాన్‌కు చెందిన తంగ్ హ్సింగ్(76) అనే ఓ కౌన్సిలర్ మాత్రం తన చావును పుట్టినరోజు లాగే సెలబ్రేట్ చేసుకోవాలని చనిపోయేముందు తన కుటుంబ సభ్యులతో చెప్పాడు. ఆ మేరకు తంగ్ హ్సింగ్ కుటుంబం కూడా ఆయన చావును బాగానే సెలబ్రేట్ చేసింది. తంగ్ హ్సింగ్ మరణించిన రోజు.. ఆయన శవయాత్రను ఘనంగా నిర్వహించారు.

అంతిమ సంస్కారాల కోసం స్మశానానికి వెళ్తున్న సందర్భంగా ఆయన శవయాత్రలో 50 మంది పోల్ డాన్సర్లను రంగురంగుల వాహనాలపై నిల్చోబెట్టి.. వారితో అర్ధనగ్నంగా నృత్యాలు వేయింది.. అందరి చేత ఔరా అనిపించారు. శవయాత్ర వాహనంపై కొందరు, వాహనం ఎదురుగా మరికొందరు.. అలా బికినీ ధరించిన అమ్మాయిలంతా స్టెప్పులేస్తుంటే.. రోడ్డు మీద వెళ్లేవారంతా రెప్ప వాల్చకుండా వారినే చూస్తుండిపోయారు. ఈ ఏర్పాట్లన్ని కొడుకే దగ్గరుండి మరీ చూసుకున్నాడు. ఆవిధంగా.. తంగ్ హ్సింగ్ కోరినట్టు ఆయన చావును పుట్టినరోజు తరహాలో సెలబ్రేట్ చేసి వార్తల్లోకి ఎక్కారు. ప్రస్తుతం ఈ వీడియోలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles