తమిళనాట తాటాకు బుట్టలకు భలే డిమాండ్..! boxes made out of palm tree leaves are in great demand in TN

Boxes made out of palm tree leaves are in great demand in tn

palm tree leaves, chicken, tirunelveli, plastic ban, tiruchandur, palayamkota, chicken sales, ban on carry bags, tamil nadu

boxes made out of palm tree leaves are in great demand in Tamil Nadu tirunelveli after officials ban plastic carry bags, mainly chicken sales using this for customers

తమిళనాట తాటాకు బుట్టలకు భలే డిమాండ్..!

Posted: 01/06/2017 01:34 PM IST
Boxes made out of palm tree leaves are in great demand in tn

దేశవ్యాప్తంగా ప్లాస్టిక్ క్యారీ బ్యాగులను నిషేదించాలని క్రమక్రమంగా కేంద్ర, రాష్ట్రాల అరోగ్య శాఖ అధికారులు తీసుకుంటున్న చర్యలతో ఇప్పుడు మళ్లీ గ్రామాల కుటీర పరిశ్రమలకు మంచిరోజులు వస్తున్నాయని చెప్పాలి. కేంద్రంలో గత యూపిఏ ప్రభుత్వం తీసుకువచ్చిన పలు చట్టాల కారణంగా అన్ని రాష్ట్రాలలోని ముఖ్య నగరాలు, పట్టాణాలలో ఇప్పటికే ప్లాస్టిక్ క్యారీ బ్యాగులు కనుమరుగయ్యాయి. అక్కడక్కడా కనిపించిన క్యారీ బ్యాగుల 50 మైక్రాన్ల కన్నా మించి వున్నవే తప్ప.. అంతకన్నా తక్కువ వున్న మైక్రాన్ల బ్యాగులు వాడితే జరిమాన పడుతుందన్న భయం కూడా వ్యాపారుల్లో లేకపోలేదు.

ఈ నేపథ్యంలో ప్లాస్టిక్ క్యారీ బ్యాగుల నిషేధాన్ని క్రమంగా గ్రామీణ ప్రాంతాలు, జిల్లాల్లోని చిన్న పట్టణాలలకు కూడా విస్తరింపజేస్తున్నారు అధికారులు. వాటి ఫలితంగా క్యారీ బ్యాగులకు బదులు మరో మార్గాన్ని అన్వేషించే పనిలో పడిన వ్యాపారులు కొందరు 50 మైక్రాన్ల కన్నా అధికంగా వుండే క్యారీ బ్యాగులను తీసుకువస్తుండగా, మరికోందరు మాత్రం అంతకన్నా తక్కువ ఖర్చుతో.. తమ కస్టమర్లను సంతోషపర్చడం ఎలా అని అలోచనలో పడ్డారు. ఈ నేపథ్యంలో తమిళనాడులోని తిరునల్వేలి జిల్లాలో చికెన్ వ్యాపారులకు తట్టిన ఐడియా తాటాకు బుట్టలు.

తిరునల్వేలి జిల్లా కార్పొరేషన్‌లో ప్లాస్టిక్‌ నిషేధం విధించడంతో వ్యాపారులు కొత్త మార్గాలు ఎంచుకుంటున్నారు. ప్లాస్టిక్‌ కవర్లకు బదులుగా తాటాకు బుట్టల్లో కోడిమాంసం విక్రయిస్తున్నారు. తిరునల్వేలి జిల్లాలో ఆరోగ్యశాఖ అధికారులు దుకాణాలకు వెళ్లి ప్లాస్టిక్‌ వస్తువులు, కవర్లను స్వాధీనం చేసుకుంటున్నారు. బుధవారం రోజున ప్రజల నుంచి ప్లాస్టిక్‌ వస్తువులను అధికారులు తీసుకునే పద్ధతిని కార్పొరేషన్‌ అధికారులు పరిచయం చేశారు. మిగతా రోజుల్లో జరిమానా వసూలు చేస్తున్నారు. మాంసం దుకాణాల్లో ప్లాస్టిక్‌ కవర్లను వినియోగించే వారిపై జరిమానా విధిస్తున్నారు. ఈ నేపథ్యంలో పాళయంకోట ఎస్పీ కార్యాలయం ఎదురుగా దుకాణాల్లో తాటాకు బుట్టల్లో మాంసాన్ని విక్రయిస్తున్నారు.

ఇందుకు తిరుచెందూర్‌ సమీపంలోని గ్రామాల నుంచి వందల సంఖ్యలో తాటాకు బుట్టలను వ్యాపారులు కొంటున్నారు. దీనిపై మాంసం దుకాణం యజమాని రజాక్‌ మాట్లాడుతూ కార్పొరేషన్‌ చేపట్టిన ప్లాస్టిక్‌ నిషేధ చర్యలకు వ్యాపారులు సహకరిస్తున్నారని, ఇందులో భాగంగా తాటాకు బుట్టల్లో మాంసం విక్రయిస్తున్నట్లు తెలిపారు. ప్లాస్టిక్‌ కవర్లలో మాంసం గంట దాటితే చెడిపోయే అవకాశం ఉందని, అదే తాటాకు బుట్టలో ఆరు గంటల సేపు చెడిపోకుండా ఉంటుందని తెలిపారు. తాటాకు బుట్టల ద్వారా కుటీర పరిశ్రమ కార్మికులకు ఉపాధి లభిస్తుందని అన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles