కేసీఆర్ కు శాతకర్ణి షో ఇన్విటేషన్.. రాయితీకి బాలయ్య స్పెషల్ థాంక్స్ | Balayya special thanks to KCR.

Balakrishna invite cm kcr for satkarni special show

Actor Balakrishna, Balayya KCR, Telangana CM KCR, KCR Bala Krishna, Satakarni Special Show, KCR Satakarni Special Show, Balayya invite KCR, Satakarni Telanagana Tax exemption, GSP tax exemption

Actor Balakrishna invite CM KCR to Gautamiputra Satakarni Special Show.

శాతకర్ణి షో కు కేసీఆర్ కు బాలయ్య ఆహ్వానం

Posted: 01/06/2017 01:49 PM IST
Balakrishna invite cm kcr for satkarni special show

గౌతమీపుత్ర శాతకర్ణి సినిమా ప్రారంభం రోజున సినిమా ఫస్ట్ షోకి తనను ఆహ్వానించాలంటూ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ బాలయ్యను కోరిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో శాతకర్ణి స్పెషల్ స్క్రీనింగ్ కి రావాల్సిందిగా బాలయ్య సీఎం కేసీఆర్ ను క్యాంపు కార్యాలయంలో కలిశాడు. ముందుగా తెలంగాణ అసెంబ్లీకి చేరుకున్న ఆయనకు టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి ఛాంబర్ కి తీసుకెళ్లి కాసేపు ముచ్చటించారు. అనంతరం టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు బాలయ్యతో చేయి కలిపేందుకు ఎగబడటం సందడిగా అనిపించింది.

ఆపై తన 100వ చిత్రం 'గౌతమీపుత్ర శాతకర్ణి' సినిమాను చూడాలని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ను బాలకృష్ణ ఆహ్వానించారు. సినిమా చూడాలని కోరుతూ ప్రత్యేకంగా తయారు చేసిన ఆహ్వాన పత్రాన్ని అందిచారు. ప్రజా ప్రతినిధులకు, వీఐపీలకు వీలుగా ఉండేలా, రిలీజ్ కు ముందే ఒక షోను ఏర్పాటు చేస్తున్నామని, దానికి రావాలని బాలయ్య కోరినట్టు సమాచారం. ఈ సందర్భంగా కేసీఆర్ స్పందిస్తూ, శాతకర్ణి సినిమా చూసేందుకు తానెంతో ఎదురు చూస్తున్నానని, ఎప్పుడు ఎక్కడికి రమ్మన్నా వచ్చి సినిమా చూస్తానని చెప్పినట్టు తెలుస్తోంది. అదే సమయంలో అగ్రహీరోలంతా ఉంటే బావుంటుందన్న ఆశాభావం ఆయన వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ఆఫై కాసేపు సినిమా గురించి ముచ్చటించుకున్న తర్వాత బాలయ్య బయలుదేరాడు.

కాగా, తెలంగాణ‌లో త‌న‌ సినిమాకు పన్ను రాయితీ ఇచ్చినందుకు కేసీఆర్‌కు బాల‌కృష్ణ‌ ధ‌న్య‌వాదాలు తెలిపారు. ఈ సినిమా తాను న‌టిస్తున్న 100వ సినిమా కావ‌డంతో బాల‌కృష్ణ ఈ సినిమాను చూసేందుకు కేసీఆర్‌తో పాటు ప‌లువురు ప్ర‌ముఖుల‌ని కూడా ఆహ్వానించే ప‌నిలో బిజీబిజీగా ఉన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles

Today on Telugu Wishesh