అమ్మ ఇలాకాలో చిన్నమ్మకు షాక్ | RK Nagar people rejected Chinamma.

Rk nagar people not interest in sasikala

AIADMK Chief, Sasikala Natarajan, RK Nagar Constituency, Deepa Jayakumar, Jayalalithaa's Constituency, RK nagar Jayalalitha, RK nagar Sasikala, Chinamma RK nagar, Deepa Jayakumar RK nagar, Deepa Jayakumar Sasikala Natarajan

New AIADMK Chief Sasikala Natarajan Not Welcome In Jayalalithaa's Constituency.

చిన్నమ్మా... నీకంత సీన్ లేదు!

Posted: 01/06/2017 01:18 PM IST
Rk nagar people not interest in sasikala

అన్నాడీఎంకే పగ్గాలు చేపట్టినంత మాత్రాన అమ్మ క్రేజ్ నీకు వచ్చేసినట్లు అనుకుంటున్నావా? అంటున్నారు ఆర్కే నగర్ నియోజక వర్గ ప్రజలు. జయ కంచుకోటగా ఉన్న ఆ నియోజకవర్గం నుంచే శశికళ పోటీ చేయనుందన్న వార్తల నేపథ్యంలో వారు తీవ్రంగా మండిపడుతున్నారు. జయ సరిపోయి సరిగ్గా నిన్నటికి నెల కావటం, అన్నాడీఎంకే నేత వెట్రివెల్ అమ్మ స్థానం నుంచే పోటీ చేయాలని కోరటంతో ఆగ్రహించిన మహిళలు ర్యాలీ తీసి మహిళలు తమ నిరసన తెలిపారు.

చిన్నమ్మ ఆశలు పెట్టుకొని పెద్దగా ఊహించుకోద్దు. మా వద్దకు వచ్చి ఓట్లు అడగొద్దు. మేం ఇక్కడ ఉన్నామంటే అది అమ్మకోసమే' అంటూ నినదించారు. ఆర్‌కే నగర్‌ ప్రజలకు జయమ్మ అంటే ఎక్కడ లేని అభిమానం. ఆమె చనిపోవడంతో ప్రస్తుతం అదే చోటు నుంచి ప్రస్తుతం పార్టీ పగ్గాలు చేతబట్టి ముఖ్యమంత్రి పదవికై సాగుతున్న శశికళ పోటీ చేయాలనుకుంటున్నారు. కానీ, ఇక్కడి ప్రజల నుంచి శశికళకు తీవ్ర వ్యతిరేకత ఎదురవుతోంది. ఇది జయమ్మ చోటని, ఇక్కడికి శశిని అనుమతించం అంటున్నారు.

అయితే అనుహ్యాంగా అమ్మ జిరాక్స్ గా ముద్రపడిపోయిన ఆమె మేనకొడలు దీపకు మాత్రం వారంతా మద్ధతు ఇస్తున్నారు. 'మా అమ్మ (జయలలిత) 77 రోజులు ఆస్పత్రిలో ఉన్నారు. ఒక్కరోజైనా శశికళ మాకు చూపించారా. జయ మేనకోడలు దీపా జయకుమార్‌ మాత్రమే మా దగ్గర నుంచి పోటీ చేయాలి. ఆమె మాత్రం మా జయలలిత వారసత్వాన్ని కొనసాగించాల్సింది' అంటూ ఆర్కే నగర్‌ వాసులు అంటున్నారు. ఇప్పటి కొంతమంది గ్రూపులుగా వెళ్లి శశికళకు ఓట్లు అడగొద్దంటూ నేరుగా విజ్నప్తి చేసినట్లు కూడా సమాచారం.

అయితే దీని వెనుక డీఎంకే కుట్ర దాగి ఉందని వెట్రివేల్ చెబుతుండగా, దీపా ఇంటి బయట అన్నాడీఎంకే కార్యకర్తలు పడిగాపులు పడుతుండటం విశేషం. సమయం వచ్చినప్పుడు నా నిర్ణయం ప్రకటిస్తా. నన్నెవ్వరూ ఆపలేరంటూ దీప కూడా కామెంట్లు చేయటం చర్చనీయాంశంగా మారింది. మరోవైపు మధుర నుంచి శశికళ పోటీ చేయించాలన్న ఆలోచనలో సీనియర్లు ఉన్నట్లు సమాచారం.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : RK nagar  Sasikala Natarajan  AIADMK Chief  Deepa Jayakumar  

Other Articles