బాప్ ఏక్ నంబర్.. బేటా దస్ నంబర్ | Osama Bin Laden son put on US terror list.

Us puts sanctions on bin laden s son

Al-Qaeda, Osama Bin Laden, Laden Son, Hamza bin Laden, US terror list, Bin Laden's son, Hamza bin Laden, Laden son in terror list, Hamza bin Laden on blacklist, Al-Qaeda new chief, Bin Laden's Son, Specially Designated Global Terrorist

US puts slain Al-Qaeda leader Osama Bin Laden's son Hamza bin Laden on blacklist.

లాడెన్ కొడుక్కి అంతర్జాతీయ గుర్తింపు

Posted: 01/06/2017 12:00 PM IST
Us puts sanctions on bin laden s son

ఒసామా బిన్ లాడెన్ అగ్ర రాజ్యం అమెరికా సహా ప్రపంచ దేశాలను గడగడలాడించిన అల్ ఖైదా టెర్రర్ దిగ్గజం. చిక్కడు-దొరకడు రేంజ్ లో తిప్పలు పెట్టి పాక్ సరిహద్దులో తలదాచుకున్న ఆయనగారిని అమెరికా దళాలు చాకచక్యంగా మట్టుపెట్టిన విషయం తెలిసిందే. లాడెన్ మరణానంతంరం అల్ ఖైదా కార్యకలాపాలన్నీ కాస్త తగ్గుముఖం పట్టాయి. అదే సమయంలో మరోవైపు ఐసిస్(ఐఎస్ఐఎస్) ప్రాబల్యం పెరిగిపోవటంతో దాదాపు కనుమరుగైనట్లేనని అంతా అనుకున్నారు.

అయితే అనూహ్యంగా తెరపైకి లాడెన్ కొడుకు హంజాబిన్ పేరును తెచ్చి మళ్లీ వార్తల్లో నిలిచింది ఉగ్రసంస్థ. తండ్రి మరణానంతరం మే 2, 2011నే చీఫ్ గా బాధ్యతలు చేపట్టినప్పటికీ, అధికారిక వ్యవహారాల్లోకి మాత్రం ఈ మధ్యే ప్రవేశించాడు. పశ్చిమాసియా రాజధానుల్లో చిన్న చిన్న దాడులతో అలజడి కూడా రేపింది. దీంతో హంజాబిన్ లాడెన్ ను గ్లోబల్ టెర్రరిస్ట్ గా అమెరికా ప్రకటించింది. హంజాబిన్ వయసు 20 ఏళ్లు మాత్రమే. ఇతనిపై సెక్షన్ 1 కింద ఆంక్షలు విధించింది.

ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ 13224 ప్రకారం అమెరికా రక్షణ, భద్రత కోసం హంజాబిన్ తో లావాదేవీలన్నింటినీ నిషేధించింది. హంజాబిన్ ను ఆల్ ఖైదా సభ్యుడిగా ఆ సంస్థ నేత అల్ జవహరి 2015 ఆగస్ట్ 14న ప్రకటించాడు. ఆ తర్వాత హంజాపై నిఘా పెట్టిన అమెరికా.... ఉగ్రవాద కార్యకలాపాల్లో అతను చురుకుగా పొల్గొంటున్నాడని నిర్ధారణకు వచ్చింది. వాషింగ్టన్ భద్రతా దళాలకు చెందిన అధికారి బ్రూస్ రైడల్ కూడా తండ్రి మరణంపై యూఎస్ పై హంజా రగిలిపోతున్నాడని, అతనో ప్రమాదకరమైన శత్రువుగా అభివర్ణించాడు.

లాడెన్ కు ట్విన్ టవర్స్ పై దాడి తర్వాత కూడా ఈ హోదాను ఇవ్వటానికి అమెరికాకు సమయం పట్టింది. కానీ, హంజా మాత్రం ఆ హోదాను తొందరగా సంపాదించేసుకున్నాడు. రానున్న రోజుల్లో నాన్న కన్నా నాలుగు బాంబులు ఎక్కువే వేసే ఛాన్సుందన్న అభిప్రాయం వ్యక్తం చేశాడు. మరి అగ్రరాజ్యం మొగ్గగా ఉన్నప్పుడే తుంచుతుందా? లేదా ఎదగనిస్తుందా? అన్నది చూద్దాం.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Al-Qaeda  Osama Bin Laden  Laden Son  Hamza bin Laden  US terror list  

Other Articles