మోదీ నిర్ణయంకి ఊహించని వ్యక్తి సపోర్ట్ | Demonetisation a creative disruption.

Duvvuri subbarao described demonetisation as creative disruption

Duvvuri Subbarao, Reserve Bank of India Governor, Demonetization, Narendra Modi, Black Money, Modi Duvvuri Subbarao, Demonetisation a Creative Disruption, RBI former governor support Modi

Duvvuri Subbarao backs to Narendra Modi. Former governor of the Reserve Bank of India, has described demonetization as creative disruption that attempted to destroy black money.

నోట్ల రద్దు అంటే తెలివిగా నాశనం చేయటమే...

Posted: 01/06/2017 08:12 AM IST
Duvvuri subbarao described demonetisation as creative disruption

కరెన్సీ కష్టాలను కాసేపు పక్కనబెడితే నోట్ల రద్దు అనేది ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపే ఓ అంశమని మాత్రం తేలిపోయింది. నల్లధనం వెలుగు చూడటం మాట అటుంచి 15 లక్షల కోట్ల డిపాజిట్లు పాత కరెన్సీ రూపంలో ఇప్పటిదాకా ఆర్బీఐ ను చేరింది. మరోవైపు రాజకీయంగానే కాదు పలువురు మేధావులు కూడా మోదీ తీసుకున్న నిర్ణయంపై పెదవి విరవటం చూశాం. అమర్త్యసేన్ లాంటి ఆర్థిక దిగ్గజం కూడా అది బ్లాక్ మనీపై ఎలాంటి ప్రభావం చూపబోదని తేల్చేశాడు. పైగా రానున్న రోజుల్లో సంక్షోభం దిశగా అడుగులు వేసిన ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని వ్యాఖ్యానించాడు కూడా.

కానీ, ఇప్పుడు మోదీ తీసుకున్న ఈ నిర్ణయాన్ని ఓ అనుకోని మద్ధతు వచ్చి చేరింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మాజీ గవర్నర్ దువ్వూరి సుబ్బారావు మోదీ తీసుకున్న నిర్ణయంపై హర్షం వ్యక్తం చేశాడు.
హైదరాబాద్‌లో జరిగిన ఓ అంతర్జాతీయ సదస్సులో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ.. పెద్ద‌నోట్ల ర‌ద్దుపై స్పందించారు. భార‌త్‌లో 1991 ఆర్థిక సంస్కరణల తర్వాత కేంద్ర స‌ర్కారు తీసుకున్న ఓ గొప్ప చ‌ర్య ఇది అని ఆయన అన్నారు. దేశంలో నల్లధనం నిరోధానికి ఇది ఎంతగానో ఉపయోగపడుతుందని చెప్పారు.

 (నోట్ల రద్దు జస్ట్ శాంపిల్)

దేశంలోని క‌రెన్సీలో 86 శాతం ఉన్న పెద్ద‌నోట్ల‌ను రద్దు చేస్తూ ప్రధానమంత్రి నరేంద్రమోదీ కీలక నిర్ణయం తీసుకున్నారని ఆయ‌న అన్నారు. ఇది ఎంతో ప్రత్యేకమైన చ‌ర్య అని వ్యాఖ్యానించారు. దీనిని ప్రత్యేక సృజనాత్మకతతో కూడిన విధ్వంస చర్యగా అభివ‌ర్ణించిన ఆయ‌న‌... నల్లధనాన్ని ఎంతో తెలివిగా నాశనం చేయడమే ఈ చ‌ర్య ఉద్దేశ‌మ‌ని కుండబద్ధలు కొట్టినట్లు చెప్పేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Duvvuri Subbarao  PM Narendra Modi  Demonetization  Support  

Other Articles