సికింద్రాబాద్-ఢిల్లీ రైళ్లను రద్దు చేసేశారు | Trains cancelled due to track damage.

Trains cancelled between secunderabad and delhi

Goods train derail, railway track damage, Secunderabad to Delhi trains, Cancelled, Trains delay, South Central railway, Bhagyanagar Express

Goods train derail and railway track damaged near Maharashtra, Secunderabad to Delhi trains cancelled.

సికింద్రాబాద్-ఢిల్లీ రైళ్లు రద్దు!

Posted: 01/06/2017 07:46 AM IST
Trains cancelled between secunderabad and delhi

ప్రయాణికుల కోసం దక్షిణ మధ్య రైల్వే ఓ ప్రకటన జారీ చేసింది. సికింద్రాబాద్‌-ఢిల్లీ మ‌ధ్య న‌డిచే ప‌లు రైళ్ల‌ను రద్దు చేసినట్లు అధికారులు వెల్లడించారు. మరి కొన్ని రైళ్ల‌ను ఎక్క‌డికక్క‌డ నిలిపివేసినట్లు చెప్పారు. మ‌హారాష్ట్ర‌లోని వీర్గామ్ వ‌ద్ద గూడ్స్ రైలు ప‌ట్టాలు త‌ప్ప‌డంతో ట్రాక్ పూర్తిగా ధ్వంస‌మైంది. భారీ క్రేన్ల సాయంతో రైల్వే సిబ్బంది గూడ్స్‌రైలు బోగీల‌ను తొల‌గిస్తున్నారు. దీంతో ప‌లు రైళ్ల రాక‌పోక‌ల‌కు తీవ్ర అంత‌రాయం ఏర్ప‌డింది.

దీంతో బ‌ల్లార్షా నుంచి సికింద్రాబాద్ వెళ్లే భాగ్య‌న‌గ‌ర్ ఎక్స్‌ప్రెస్‌ను ర‌ద్దు చేశారు. మంచిర్యాల వ‌ద్ద చెన్నై-ఢిల్లీ జీటీ ఎక్స్‌ప్రెస్‌ను రైల్వే అధికారులు ర‌ద్దు చేశారు. కాగ‌జ్‌న‌గ‌ర్ వ‌ద్ద ద‌ర్బాంగా ఎక్స్‌ప్రెస్‌, నాగ్‌పూర్ ప్యాసింజ‌ర్ రైలును నిలిపివేశారు. ప్ర‌యాణికుల కోసం అధికారులు హెల్ప్ లైన్ నంబ‌ర్లు ఏర్పాటు చేశారు. గూడ్స్ రైలు బోగీల‌ను తొల‌గించి ట్రాక్ మ‌ర‌మ్మ‌తులు పూర్తి చేసిన అనంత‌రం రైళ్ల రాక‌పోక‌లు పున‌రుద్ధ‌రిస్తామ‌ని అధికారులు తెలిపారు.

రైళ్ల రాక‌పోక‌లు, ఇత‌ర వివ‌రాల కోసం ప్ర‌యాణికులు ఈ నంబ‌ర్ల‌లో సంప్ర‌దించ‌వ‌చ్చు.

సికింద్రాబాద్ 040-27786170, 27700868, 27786539, 27788889, ఖ‌మ్మం 08742224541, వ‌రంగ‌ల్ 0870-2426232, కాజీపేట 0870-2576430, 2576226, సిర్పూరు కాగ‌జ్‌న‌గ‌ర్ 08738-238717.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Secunderabad  Delhi trains  Cancelled  South Central railway  

Other Articles