వైద్యులను క్షమాపణలు కోరిన బీజేఫీ ఎంపీ BJP MP Ananthkumar Hedge apologises doctors

Bjp mp ananthkumar hedge apologises doctors

Uttar Kannada, Sirsi, Rajnath Singh, Rahul Gandhi, Rahul, Nalin Kumar Kateel, MLA, Mangaluru, madhukeshwar, Indian Medical Association, hegde dr prakash harishchandra, Dinesh Hegde, Deralakatte, Dakshina Kannada, Congress, CCTV, BJP, Balachandra, Ananth Kumar Hegde, amit shah, bs yeddyurappa

Upset that his mother was not given the right attention, Uttar Kannada MP Ananth Kumar Hegde beat doctors of a private hospital in Sirsi; later apolofises.

వైద్యులను క్షమాపణలు కొరిన బీజేఫీ ఎంపీ

Posted: 01/04/2017 04:39 PM IST
Bjp mp ananthkumar hedge apologises doctors

అయన ఒక ప్రజాప్రతినిధి.. అందునా కాంగ్రెస్ అధికారంలో వున్న కర్ణాటకలోని కమళ దళానికి చెందిన చట్టసభ ప్రతినిధి. సరైన సమాచారం తెలుసుకోకుండానే.. తన తల్లి మీదున్న అప్యాయతో.. లేక అమె పడుతున్న నోప్పిని చూసి తట్టుకోలేకనో మొత్తానికి వైద్యులపై మాత్రం తన ప్రతాపాన్ని చూపారు. ఒకటి, రెండు కాదు.. ఏకంగా డాక్టర్లు అన్న ఇంగితాన్ని కూడా మర్చిపోయి.. వారికి రక్తపు గాయాలయ్యేట్లు కొట్టారు. అది కూడా వారికి చెందిన అస్పత్రిలోనే తమ సిబ్బంది అంతా చూస్తుండగా, వైద్యులను తరమి తరిమి కోట్టారు. అడ్డుకోబోయిన సిబ్బందిని కూడా విఛక్షణ కోల్పయినట్లుగా కోట్టారు. తన కోసం చల్లారాక తాపీగా క్షమాపణలు కోరాడు.

వివరాల్లోకి వెళ్తే.. ఉత్తర కన్నడ జిల్లా బీజేపీ ఎంపీ అనంతకుమార్ హెగ్డే తల్లికి కాలు విరగడంతో ఉత్తర కన్నడ జిల్లాలోని శిరిసి పట్టణంలోని టీఎస్ఎస్ ఆసుపత్రికి తరలించారు. ఆమెకు కాలు విరిగిందని చెప్పిన వైద్యులు మరో రోగికి శాస్త్ర చికిత్స చెయ్యడానికి వెళ్లారు. సోమవారం రాత్రి ఆసుపత్రికి చేరుకున్న ఎంపీ అనంతకుమార్ హెగ్డే తన తల్లికే మీరు సరైన వైద్యం చెయ్యడం లేదని, మీరు సామాన్యులను ఏమి పట్టించుకుంటారని అని రెచ్చిపోయి వైద్యుల మీద దాడి చేశారని ఆరోపణలు వచ్చాయి.

ఎముకల డాక్టర్ మధుకేశ్వర చెవి, ముఖం మీద గాయాలైనాయని, డ్యూటీ డాక్టర్ బాలచంద్ర భట్, ఆసుపత్రి ఉద్యోగి రాహుల్ కు పలు చోట్ల గాయాలైనాయని ఆసుపత్రి సిబ్బంది ఆరోపించారు. అదే రోజు అర్దరాత్రి వైద్యులు అందరూ సమావేశం అయ్యి బీజేపీ ఎంపీ అనంతకుమార్ హెగ్డే మీద కఠిన చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు. ఆసుపత్రిలో ఎంపీ దాడి చేసే సమయంలో సీసీ కెమెరాల్లో రికార్డు అయిన క్లిప్పింగ్ లు తీసుకుని వైద్యులు అందరూ కలిసి పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే టీఎస్ఎస్ ఆసుపత్రి చైర్మన్ శాంతారామ హెగ్డే వైద్యులను, బీజేపీ ఎంపీ అనంతకుమార్ హెగ్డేని ఒక చోట కుర్చోపెట్టి రాజీ చేశారని తెలిసింది.

అయితే ఈ పార్లమెంటు సభ్యుడికి ఇప్పుడే సామాన్యులు గుర్తుకు వచ్చారా..? అంటూ నెట్ జనులు దమ్మెత్తిపోస్తున్నారు. ఎన్నికల్లో గెలిచి మూడేళ్లు కావస్తున్న తరుణంలో ఏ ఒక్కసారి తమకు ఓట్లేసిన ప్రజలు కష్ట నష్టాలను పట్టించుకోని నేతలు.. తమకో లేక తమవారికేమైనా అయితే.. తమకే ఇలా జరిగితే.. ఇక సామాన్యులకు ఎలా అంటూ ప్రశ్నిస్తారని.. అయితే వాళ్ల కుటుంబికులో లేక బందువులో అస్పత్రుల్లో వుంటూ తప్ప వారికి సామాన్యులు, వారి కష్టాలు గుర్తుకు రావా..? అంటూ నెట్ జనులు మండిపడుతున్నారు. కర్ణాటకలో చట్టాన్ని చేతిలోకి తీసుకున్న మంత్రులను బర్తరఫ్ చేయించిన బీజేపి.. ఈ ఘటన నేపథ్యంలో అనంత్ కుమార్ హెగ్డేను కూడా పదవికి రాజీనామా చేయాలన్న డిమాండ్లు కూడా వినిపిస్తున్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Rahul  Nalin Kumar Kateel  MLA  Mangaluru  madhukeshwar  Dinesh Hegde  Deralakatte  Dakshina Kannada  Congress  BJP  

Other Articles