వీర్యం దాతలకు కాసుల పంట.. బంఫర్ అఫర్ american organisation pays crores for sperm donars

American organisation pays crores for sperm donars

purinatic llc, sperm donars, american organisation, high price, selective sperm, dna, habbits, IQ, dalaware organisation, active, study, selected sperm, Rs 3.5 Crore

An american organisation located in delaware announced that it pays 3.5 crores o rupees for sperm donars.

డోనరులూ.. బహుపరాక్.. కోట్లు రాలుస్తున్న వీర్యం..!

Posted: 01/04/2017 05:29 PM IST
American organisation pays crores for sperm donars

దానలన్నింటోకెల్లా ఫలానా దానం గోప్పది అని నేత్ర దానం, రక్త దానం, అవయవ దానం గురించి విన్నాం. అంతక్నా ముందు అన్న దానం, ఇలా అనేకం విన్నాం.. కానీ తాజాగా అన్నీ దానాల్లోకెళ్లా వీర్య దానం గోప్పది అనేట్టుగా మారిపోయాయి పరిస్థితులు. ఎందుకంటారా..? ఏ దానం చేసినా.. ఏముంది గర్వ కారణం.. వీర్య ధానం చేస్తే కారణం సంగతి దేవుడెరుగు కానీ.. కాసులు కాదు కాదు కోట్ల రూపాయలు మాత్రం వచ్చి పడటం ఖాయం. ఇంకే గోప్పవారయినట్టే కదా..! నమ్మశక్యంగా లేదా..? కానీ ఇది ముమ్మాటికీ నిజం.

అమెరికాలోని ఓ సంస్థ మాత్రం తమకు కావాల్సిన వ్యక్తులను ఎంచుకుని వారి సంతానాన్ని పరిశీలించి.. వారు అనుకున్న విధంగా అన్నీ సవ్యంగా వున్నాయని పరిశీలించి.. అధ్యయనం చేసిన తరువాత తాము వీర్యం తీసుకునే దాతలకు అక్షరాల కోట్ల రూపాయలను కుమ్మరిస్తారట. అందుకు వీర్యాన్ని ముందుగా సేకరించి దాని నుంచి డీఎన్ఏ ను కూడా అధ్యయం చేసిన తరువాతే సుమా.! సాధారణంగా వీర్యం.. అండం దానమిచ్చే వారికి కొద్ది మొత్తంలో డబ్బు అందుతుంది. కానీ.. ఈ సంస్థ అన్ని విధాలుగా, జన్యుపరంగా సరైన వ్యక్తి ఇచ్చే వీర్యానికి ఏకంగా రూ. 3.5కోట్లు ఇస్తామని ప్రకటించింది. ఇకనేం ఇలా ప్రకటన వెలువడిందో లేదో.. ఏకంగా కుప్పలు తెప్పలుగా అప్లికేషన్లు వచ్చి పడ్డాయట.

జన్యువుల ప్రభావం వల్ల తల్లిదండ్రులు ఏ విధంగా ఉంటే పిల్లలు ఆ విధంగానే ఉంటారు. ఎవరి పిల్లలు వారిలాగే జీవిస్తారు. అయితే సంతానోత్పత్తి లేని వారికి కృత్రిమ గర్భాధారణ జరిపి పిల్లల్ని పుట్టిస్తున్నారు. ఈ క్రమంలోనే అమెరికాలోని డెలావర్‌ ప్రాంతంలోని ప్యురెనెటిక్‌ ఎల్‌ఎల్‌‌సీ సంస్థ నాణ్యమైన, మేటి వీర్యం.. అండం కనుగొనాలని భావించింది. ఈ మేరకు పురుషుల్ని వీర్యం.. మహిళల్ని అండాలను దానం చేయమని ఆహ్వానిస్తోంది. దానం చేయాలనుకునే వారు తొలుత సంస్థ వెబ్‌సైట్‌లో రిజిస్టర్‌ చేసుకోవాలని కోరింది. దంపతులు గానీ, వేరు వేరు వ్యక్తులు గానీ వారి పేర్లని రిజిస్టర్‌ చేసుకోవచ్చని తెలిపింది.

ఎంపిక చేసిన వారి నుంచి వీర్యం, అండం సేకరించి పరీక్షలు నిర్వహిస్తారు. కాగా, అంతకు ముందే వీర్యం, అండం దానం చేసిన వారి విద్యాబుద్ధులు, కుటుంబ నేపథ్యం, ఆరోగ్య పరిస్థితి, డీఎన్‌ఏలను పరిశీలిస్తారు. ఆయా అంశాల్లో ఉన్నత ప్రమాణాలను కలిగి ఉంటే వారి నుంచి మాత్రమే వీర్యం.. అండం సేకరించడం జరుగుతుందని సంస్థ స్పష్టం చేసింది. ఇలా తమకు కావాల్సిన వీర్యం, అండం దానం చేసిన వారికి రూ. 3.5కోట్ల రూపాయలు అందిస్తామని పేర్కొంది. అంతే మరీ.. ఉరికనే ఉత్పత్తి అయ్యే వీర్యానికి కూడా కాసులు వస్తాయని తెలిస్తే.. ఎవరు మాత్రం పోటీ పడరు.. డోనరులారా.. బహుపరాక్..!

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles